దుబ్బాకలో కాషాయం జెండా ఖాయంః బండి సంజయ్

దుబ్బాక ఉప ఎన్నికలో కాషాయ జెండా ఎగరడం ఖాయమని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ ఆశాభావం వ్యక్తం చేశారు.

దుబ్బాకలో కాషాయం జెండా ఖాయంః బండి సంజయ్

Updated on: Oct 29, 2020 | 1:45 PM

దుబ్బాక ఉప ఎన్నికలో కాషాయ జెండా ఎగరడం ఖాయమని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ ఆశాభావం వ్యక్తం చేశారు. దుబ్బాక ఉపఎన్నికల్లో భాగంగా బీజేపీ గురువారం మిరుదొడ్డి మండలం మోతే గ్రామంలో ఎన్నికల ప్రచారం నిర్వహించింది. ఈ ప్రచార ర్యాలీలో బీజేపీ అభ్యర్థి రఘునందన్‌రావుకు మద్దతుగా బండి సంజయ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సంజయ్ మాట్లాడుతూ దుబ్బాకలో బీజేపీ గెలవడం ఖాయమైందన్నారు. మీటర్లు పెట్టేది వ్యవసాయ మోటార్లకు కాదని.. టీఆర్ఎస్‌కని అన్నారు. తప్పుడు ప్రచారం చేస్తున్న టీఆర్ఎస్‌కు సరైన బుద్ధి చెబుతామన్నారు దుబ్బాక ఫలితాలు సీఎం కేసీఆర్, మంత్రి హరీష్‌రావుకు షాకివ్వబోతున్నట్లు రఘునందన్‌రావు తెలిపారు.

Loading...
Unable to load recommendations.
Follow Us