లోక్‌సభ ఎన్నికల ప్రచారానికి ఖరారైన టీఆర్ఎస్ పార్టీ షెడ్యూల్

| Edited By:

Mar 27, 2019 | 9:07 AM

లోక్‌సభ ఎన్నికల్లో ప్రచారానికి టీఆర్ఎస్ పార్టీ షెడ్యూల్ ఖరారైంది. పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఇవాళ్టి నుంచి ఏప్రిల్ 9 వరకు రాష్ట్రంలో విస్తృతంగా ప్రచారం నిర్వహించనున్నారు. ఈ మేరకు ప్రచార షెడ్యూల్‌ను పార్టీ సిద్ధం చేసింది. రోడ్‌ షోలు, బహిరంగసభల్లో పాల్గొంటారు కేసీఆర్. ఎన్నికల ప్రచారంలో భాగంగా రాష్ట్రంలోని అన్ని పార్లమెంట్ నియోజకవర్గాల్లో పర్యటిస్తారు కేటీఆర్. ఖమ్మం, మహబూబాబాద్, కరీంనగర్, నల్గొండ, మహబూబ్ నగర్‌తో పాటు చేవెళ్ల, మల్కాజ్ గిరి, సికింద్రాబాద్ నియోజక వర్గాల్లో బహిరంగ […]

లోక్‌సభ ఎన్నికల ప్రచారానికి ఖరారైన టీఆర్ఎస్ పార్టీ షెడ్యూల్
Follow us on

లోక్‌సభ ఎన్నికల్లో ప్రచారానికి టీఆర్ఎస్ పార్టీ షెడ్యూల్ ఖరారైంది. పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఇవాళ్టి నుంచి ఏప్రిల్ 9 వరకు రాష్ట్రంలో విస్తృతంగా ప్రచారం నిర్వహించనున్నారు. ఈ మేరకు ప్రచార షెడ్యూల్‌ను పార్టీ సిద్ధం చేసింది. రోడ్‌ షోలు, బహిరంగసభల్లో పాల్గొంటారు కేసీఆర్.

ఎన్నికల ప్రచారంలో భాగంగా రాష్ట్రంలోని అన్ని పార్లమెంట్ నియోజకవర్గాల్లో పర్యటిస్తారు కేటీఆర్. ఖమ్మం, మహబూబాబాద్, కరీంనగర్, నల్గొండ, మహబూబ్ నగర్‌తో పాటు చేవెళ్ల, మల్కాజ్ గిరి, సికింద్రాబాద్ నియోజక వర్గాల్లో బహిరంగ సభలు నిర్వహించనున్నారు.