TRS on Etela Rajendar: కాషాయం వైపు ఈటల వేగంగా అడుగులు.. ఆయనపై వేటుకు గులాబీ దళం రంగం సిద్ధం..!

|

Jun 01, 2021 | 7:26 PM

మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ బీజేపీ అడుగులు వేస్తుంటే... ఆయనపై వేటుకు రంగం సిద్ధం చేసింది గులాబీ దళం. ఢిల్లీ వెళ్లి మరీ బీజేపీ అధ్యక్షుడు నడ్డాను కలవడంపై ఆగ్రహంగా ఉంది.

1 / 5
మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ బీజేపీ అడుగులు వేస్తుంటే... ఆయనపై వేటుకు రంగం సిద్ధం చేసింది గులాబీ దళం. ఢిల్లీ వెళ్లి మరీ బీజేపీ అధ్యక్షుడు నడ్డాను కలవడంపై ఆగ్రహంగా ఉంది. టెక్నికల్‌గా ఇప్పటికీ టీఆర్ఎస్ లోనే ఉన్న ఆయన కాషాయ పార్టీ పెద్దలతో మంతనాలపై TRS అధినేత చాలా సీరియస్‌గా ఉన్నారు. ఏ క్షణమైనా రాజేందర్‌పై వేటు పడటం ఖాయమని తెలుస్తోంది.

2 / 5
మంత్రివర్గం నుంచి బర్తరఫ్‌ అయిన తర్వాత ఈటల కాంగ్రెస్‌ నేతలను సైతం కలిశారు. అప్పటి నుంచే రాజేందర్‌పై టీఆర్‌ఎస్‌ సీరియస్‌గా ఉంది. ఇప్పుడు ఏకంగా ఢిల్లీ వెళ్లి బీజేపీలో చేరడంపై మంతనాలు జరపడం మరింత ఆగ్రహానికి కారణమైంది. ఈ కారణంగానే ఆయన్ను పార్టీ నుంచి బహిష్కరించడానికి రంగం సిద్ధమైనట్లు తెలుస్తోంది.

3 / 5
ఇదొక్కటే కాదు... కారు గుర్తుపై ఎమ్మెల్యేగా గెలిచి పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారన్నదీ టీఆర్ఎస్ అభ్యంతరం. ఇదే క్రమంలో ఆయనపై అనర్హత వేటు వేయాలని స్పీకర్‌కు ఫిర్యాదు చేసేందుకు సిద్ధమవుతోంది. అయితే సరైన సమయం చూసి అధ్యక్షుడు నిర్ణయం తీసుకుంటారని చెబుతున్నారు నేతలు.

4 / 5
DK Aruna

DK Aruna

5 / 5
పార్టీ పరంగా ఇబ్బంది రాకుండా హుజూరాబాద్‌పై ఫోకస్‌ పెంచింది గులాబీ దళం. మంత్రులు హరీష్‌రావు, గంగుల కమలాకర్‌ మండలాల వారీగా నేతలతో చర్చలు జరిపారు. పార్టీతోనే ఉంటామని హామీ ఇచ్చారు స్థానిక నేతలు.