TRS Plenary: పింక్‌ సిటీగా మారిన నగరం.. ప్లీనరీ కోసం భారీ ఏర్పాట్లు చేస్తున్న టీఆర్‌ఎస్..

సోమవారం పింక్‌ ఫెస్టివల్.! ప్లీనరీకి ఏర్పాట్లు పూర్తయ్యాయి.! మూడేళ్ల తర్వాత జరుగుతున్న పార్టీ పండగ కోసం అదిరిపోయే ఏర్పాట్లు చేశారు. మొత్తం ఏడు తీర్మానాలను ఆమోదించనున్నారు.

TRS Plenary: పింక్‌ సిటీగా మారిన నగరం.. ప్లీనరీ కోసం భారీ ఏర్పాట్లు చేస్తున్న టీఆర్‌ఎస్..
Trs Plenary

సోమవారం పింక్‌ ఫెస్టివల్.! ప్లీనరీకి ఏర్పాట్లు పూర్తయ్యాయి.! మూడేళ్ల తర్వాత జరుగుతున్న పార్టీ పండగ కోసం అదిరిపోయే ఏర్పాట్లు చేశారు. మొత్తం ఏడు తీర్మానాలను ఆమోదించనున్నారు. గులాబీమయం. ఎటు చూసినా గులాబీమయంగా మారిపోయింది. ఇప్పటికే  TRS ప్లీనరీ కోసం HICC సిద్ధమైంది. మూడేళ్ల తర్వాత జరుగుతోంది టీఆర్‌ఎస్ ప్లీనరీ. అందుకే ఈ సారి ఏర్పాట్లు ఓ రేంజ్‌లో చేశారు. 10 రోజుల ముందునుంచే సన్నాహాలు మొదలయ్యాయి. మొదట్లో ప్రతినిధులను భారీగానే ఆహ్వానించాలకున్నారు కానీ కోవిడ్ ఇబ్బందుల వల్ల ఆ సంఖ్యను ఆరున్నర వేలకు కుదించారు. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు,కార్పొరేషన్లు, జడ్పీల ఛైర్మన్లతో పాటు మండల పరిషత్‌ అధ్యక్షులు, జడ్పీటీసీ సభ్యులు, కార్పొరేటర్ల వరకు ఆహ్వానించారు. అందరూ పింక్ షర్టుల్లో రావాలంటూ ఇప్పటికే సూచించారు మంత్రి కేటీఆర్.

మార్నింగ్ 10 గంటలకు ప్లీనరీ మొదలవుతుంది. రిజిస్ట్రేషన్ల కార్యక్రమం పూర్తయిన తర్వాత 11 గంటలకు సభ స్టార్ట్‌ అవుతుంది. CM కేసీఆర్‌ TRS ప్రెసిడెంట్‌గా ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు రిటర్నింగ్‌ అధికారి ప్రకటిస్తారు. తర్వాత కేసీఆర్ స్పీచ్ ఉంటుంది. ఏడు తీర్మానాలను ప్రతిపాదిస్తారు.

ప్లీనరీకోసం ప్రత్యేకంగా సాంగ్‌ను కూడా రూపొందించారు. సుద్దాల అశోక్‌తేజ రాసిన ఈ సాంగ్ సీడీని మంత్రి కేటీఆర్‌ విడుదల చేశారు.  ఇక ప్లీనరీలో వేలాది ఫొటోలతో సీఎం కేసీఆర్‌ లైఫ్‌ హిస్టరీని ప్రదర్శిస్తారు. అభివృద్ధి, సంక్షేమంపై ఫొటో ఎగ్జిబిషన్‌ను ఏర్పాటు చేస్తున్నారు. పార్కింగ్ ఇబ్బందులు రాకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. ఏకంగా 50 ఎకరాలు కేటాయించారు. Pఇక ఎప్పటి మాదిరిగానే నోరూరించే మెనూ రెడీ అయిపోయింది. 29 రకాల డెలీషియస్ డిషెస్ ప్రిపేర్ చేస్తున్నారు. ఒకేసారి 8 వేల మంది భోజనం చేసేలా మూడు హాళ్లను రెడీ చేశారు..

ఇవి కూడా చదవండి: India Pakistan, T20 World Cup LIVE Streaming: బిగ్‌ సండే.. బిగ్‌ ఫైట్‌.. మ్యాచ్ ఎక్కడ, ఎలా చూడాలో తెలుసా..

Ind Vs Pak: భారత్-పాకిస్తాన్ ఫైట్‌కు ముందు అభిమానుల గొడవ.. టీవీలు పగులుతాయ్.. అనడంతో రచ్చ..

Click on your DTH Provider to Add TV9 Telugu