ఆంధ్రప్రదేశ్‌లో పంచాయతీ ఎన్నికలు ముగిసిన వెంటనే మున్సిపల్ నగారాకు తెరలేచిన విషయం తెలిసిందే. ఇప్పటి అధికార పార్టీ పంచాయతీ ఎన్నికల్లో మాదిరిగానే వీలైనన్నీమున్సిపల్ స్థానాలను ఏకగ్రీవం చేసుకునే పనిలో పడింది. ఈ నేపథ్యంలో వైసీపీ చేసుకునే ఏకగ్రీవాలన్నీ భూటకమేనని ప్రధాని ప్రతిపక్షం ఆరోపిస్తుంది. ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడుతున్న వైసీపీని తరమికొట్టాలని అని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ అన్నారు.
గురువారం గాజువాకలో జీవీఎంసీ ఎన్నికల సందర్భంగా లోకేష్ రోడ్ షో నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెంచుతూ పోతామన్న జగన్ … సిమెంట్, ఇసుక, కరెంట్ ధర, పెట్రోలు నూనె ధరలు పెరిగిపోయాయని విమర్శించారు. ఇంటి డోర్ ముందుకు రేషన్ సరుకులు అని నమ్మించి, బండి డోర్ తెరిస్తేనే సరుకులు ఇస్తున్నారని మండిపడ్డారు. విశాఖవాసులకు ఆదివారం వస్తే భయం వేస్తోందని… ఏ ఇంటి గోడకూలుస్తారో అనే భయం అని అన్నారు.
రోడ్లకు గుంతలే పూడ్చలేదు కానీ…రాజధాని ఎలా తెస్తారంట అని నారా లోకేష్ ఎద్దేవా చేశారు. విశాఖ ఉక్కు కోసం పోరాటాలు చేసే దుస్ధితి వచ్చిందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రత్యేక హోదా రాకపోగా ఉక్కు కర్మాగారాన్ని కోల్పోయే దుస్ధితి వచ్చిందన్నారు. పది వాగ్దానాలతో ముందుకు వచ్చామన్నారు. ఇంటి పన్నులు సగం చేస్తామని తెలిపారు. నీటి పన్ను విపరీతంగా పెంచారని …టీడీపీ వస్తే నీటి పన్ను మాఫీ చేస్తామని హామీ ఇచ్చారు. ఏ2 వచ్చాకే భూదందాలు పెరిగాయని, అక్రమాలు పెరిగాయని లోకేష్ ఆరోపించారు.
అయితే ప్రధాన పార్టీలన్నీ జీవీఎంసీపై ప్రత్యేక ఫోకస్ పెట్టడంతో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్‌లో కార్పొరేషన్ ఎన్నికలు కాక రేపుతున్నాయి. మూడు పార్టీలు… ఒకే అజెండాతో జనం దగ్గరకు వెళుతున్నాయి. అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ, మరో పక్షమైన బీజేపీ సైతం అభివృద్ధి నినాదాన్నే వినిపిస్తున్నాయి. ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్‌తో విశాఖ రూపు రేఖలు మారిపోతాయని చెబుతోంది వైసీపీ. ఇన్నాళ్లు ఏం పీకారని ప్రశ్నించారు లోకేష్. విశాఖ అభివృద్ధిపై చర్చకు సిద్ధమా అని సవాళ్లు చేస్తోంది బీజేపీ.
విశాఖ కార్పొరేషన్లోని 98 డివిజన్లలో అభివృద్ధి అజెండాగానే ప్రజలు తీర్పు ఇవ్వబోతున్నారు. నెల రోజుల నుంచి ప్రచారంలో దూసుకుపోతోంది వైసీపీ. విజయసాయిరెడ్డి ప్రత్యేక ఫోకస్ పెట్టి కాలనీల్లో తిరుగుతున్నారు. మంత్రులు అవంతి, కన్నబాబు, ఎమ్మెల్యేలు ఇంటింటి ప్రచారంలో బిజీబిజీగా ఉన్నారు. మెజార్టీ సీట్లు తమవేనన్న ధీమాతో ఉంది అధికార పార్టీ. ఆపరేషన్ ఆకర్ష్‌తో టీడీపీని దెబ్బతీయాలని చూస్తోంది.
మరోవైపు గ్రేటర్ విశాఖ నుంచి తన ఎన్నికల ప్రచారాన్ని మొదలు పెట్టారు TDP జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్. గాజువాకలో రోడ్‌షో చేశారు. అభ్యర్థులతో కలిసి కాలనీలను చుట్టేస్తున్నారు. వైసీపీ ప్రభుత్వంపై సైటర్లు వేస్తూ ఓటర్లను ఆకట్టుకుంటున్నారు లోకేష్. ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ ప్రకటించి 16 నెలలు అయింది… ఒక్క ఉద్యోగమైనా ఇచ్చారా అని ప్రశ్నించారు. రోడ్డుపై చెత్త ఎత్త లేని వారికి ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ ఎందుకని ప్రశ్నించారు. మేయర్ పీఠం తమదేనని ధీమా వ్యక్తం చేశారు లోకేష్.
అటు విజయసాయిపైనా కామెంట్స్ చేశారు లోకేష్. అసలు ఆయన వైసీపీలో ఉంటారో లేదో దేవుడికే తెలియాలన్నారు. బీజేపీ సైతం అభివృద్ధి నినాదాన్నే వినిపిస్తోంది. కేంద్ర సహకారంతోనే విశాఖ లాంటి నగరాలు అభివృద్ధి జరిగాయని చెబుతోంది. స్టీల్ సిటీ డెవలప్‌మెంట్‌పై బుక్‌లెట్ వేసి మరీ వైసీపీ, టీడీపీలకు సవాళ్లు విసిరింది కాషాయ దళం. మరి అభివృద్ధి అజెండాపై సవాళ్లకు వైసీపీ రియాక్ట్ అవుతుందా? ప్రభుత్వం వచ్చాక… తాము ఏం చేశామన్న దానిపై మంత్రులు స్పందిస్తారా అనేది ఆసక్తి రేపుతోంది.
Read More: