భద్రకాళి ఆలయంలో మంత్రుల పూజలు.. కేంద్ర వ్యవసాయ చట్టాలు రైతులకు నష్టం కలిగిస్తాయన్న మంత్రులు

|

Feb 09, 2021 | 12:35 PM

రంగల్ భద్రకాళి అమ్మ వారిని రాష్ట్ర మంత్రులు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావు దర్శించుకున్నారు. మంత్రుల వెంట ఎమ్మెల్యే..

భద్రకాళి ఆలయంలో మంత్రుల పూజలు.. కేంద్ర వ్యవసాయ చట్టాలు రైతులకు నష్టం కలిగిస్తాయన్న మంత్రులు
Follow us on

వరంగల్ భద్రకాళి అమ్మ వారిని రాష్ట్ర మంత్రులు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావు దర్శించుకున్నారు. మంత్రుల వెంట ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణా రెడ్డి, వరంగల్ రూరల్ జిల్లా జడ్పీ చైర్ పర్సన్ గండ్ర జ్యోతి తదితరులు ఉన్నారు. ఈ సందర్భంగా మంత్రులకు ఆలయ ఈఓ, పూజారులు పూర్ణ కుంభ స్వాగతం పలికారు. అమ్మ వారి దీవెనలు అందించారు. అనంతరం మంత్రులకు ఆశీర్వచనం, తీర్థ, ప్రసాదాలు అందించారు.

రైతులను రాజులను చేయడమే లక్ష్యంగా సీఎం కేసీఆర్ పని చేస్తున్నారని మంత్రులు తెలిపారు. రైతులను సంఘటిత పరచి, వాళ్లకు కావాల్సిన పంటల సదుపాయాలు, మార్కెటింగ్ వ్యవస్థను ఏర్పాటు చేయడం కోసం ప్రభుత్వ నిరంతరం కృషి చేస్తుందని చెప్పారు. అందుకే సాగు నీరు, విత్తనాలు, 24గంటల విద్యుత్, రైతు వేదికలు, కల్లాలు వంటి అనేక సదుపాయాలు కల్పిస్తున్నామని చెప్పారు.

సరైన పంటల ప్రణాళికలు, పరిశోధనలు విస్తృతంగా జరుగుతున్నాయని మంత్రులు చెప్పారు. ప్రతి ఏటా రూ.400 కోట్లు రైతాంగ సంక్షేమానికి ఇవ్వడానికి సీఎం కెసిఆర్ ఆలోచిస్తున్నారని చెప్పారు. కష్ట కాలంలో రైతుల పంటలను కొనుగోలు చేసిన ఘనత తెలంగాణ ప్రభుత్వానికే దక్కుతుందని అన్నారు. కేంద్ర ప్రభుత్వ చట్టాలు రైతులకు నష్టం కలిగించేవి లా ఉన్నాయని విమర్శించారు.

 

Read more:

సీఎం కేసీఆర్ సభకు సర్వం సిద్ధం.. ధన్యవాద‌ సభ ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి జగదీష్‌రెడ్డి