ఆకస్మాత్తుగా ప్రభుత్వ పాఠశాలలో ప్రత్యక్షమైన మంత్రి.. అడగకుండానే స్కూల్‌ అవసరాలను తీర్చిన ఎర్రబెల్లి

|

Feb 10, 2021 | 1:49 PM

ఆకస్మిక తనిఖీలతో అధికారులకు ముచ్చెమటలు పట్టించే రాష్ట్ర పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు.. తాజాగా ఉన్నట్టుండి

ఆకస్మాత్తుగా ప్రభుత్వ పాఠశాలలో ప్రత్యక్షమైన మంత్రి.. అడగకుండానే స్కూల్‌ అవసరాలను తీర్చిన ఎర్రబెల్లి
Follow us on

ఆకస్మిక తనిఖీలతో అధికారులకు ముచ్చెమటలు పట్టించే రాష్ట్ర పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు.. తాజాగా ఉన్నట్టుండి ఓ స్కూల్‌లో ప్రత్యక్షమయ్యారు. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం గుర్తూరు ప్రభుత్వ మోడల్ హై స్కూల్ ఆకస్మికంగా సందర్శించారు. పాఠశాలలో కలియ తిరుగుతూ సౌకర్యాలను పరిశీలించారు.

ఈ సందర్భంగా మంత్రి విద్యార్థులతో మాట్లాడారు. పాఠశాలలో సీటింగ్ అరేంజ్మెంట్స్ ఇతర వసతులు ఎలా ఉన్నాయంటూ విద్యార్థులను ప్రశ్నించారు. ప్రస్తుతం జరుగుతున్న తొమ్మిది, పదవ తరగతి విద్యా బోధన జరుగుతున్న తీరుని ఆ పాఠశాల ప్రిన్సిపాల్ సునీత ని అడిగి తెలుసుకున్నారు.

మోడల్ స్కూల్ లో ఇంకా ఏయే అవసరాలు ఉన్నాయంటూ మంత్రి ఆరా తీశారు. వంట కోసం ఒక షెడ్ కావాలని అడగడం తో, వెంటనే, సంబంధిత అధికారులతో మాట్లాడి షెడ్ నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మంత్రి వెంట స్థానిక నేతలు ఉన్నారు.

 

Read more:

టీఆర్‌ఎస్‌ ప్రాథమిక సభ్యత్వానికి మాజీ ఎమ్మెల్సీ రాజీనామా.. డిమాండ్ల సాధన కోసం ఉద్యమ కార్యాచరణ

ఎంపీ విజయసాయిరెడ్డి ప్రసంగానికి అడ్డు తగిలిన అఖిలపక్షం కార్మికులు.. ఆయనేం మాట్లాడారు.. వీరికెందుకంత కోపం..?