
తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. 2019లో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టాన్ని తెలంగాణలోనూ అమలు చేసేందుకు అధికారికంగా లైన్ క్లియరైంది. ఆర్థికంగా వెనుకబడిన వారికి 10 శాతం రిజర్వేషన్లు కల్పించే ఉత్తర్వులను జారీ చేసింది. కేంద్ర తీసుకొచ్చిన ఈ చట్టాన్ని రాష్ట్రంలోనూ అమలు చేయనున్నట్లు ఇటీవల సీఎం కేసీఆర్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఇచ్చిన హామీ మేరకు సీఎం కేసీఆర్ జీవో జారీ చేశారు
ప్రస్తుతం రిజర్వేషన్లు పొందుతున్న వర్గాలకు తమ రిజర్వేషన్లను యథాతథంగా కొనసాగిస్తూనే, రాష్ట్రంలోని ఎకనామికల్ బ్యాక్‌వర్డ్ క్లాస్(EWS)లకు 10 శాతం రిజర్వేషన్లు అమలుచేయాలని నిర్ణయించాం. రాష్ట్రంలో 50 శాతం రిజర్వేషన్లు అమలవుతున్నాయి. EWS రిజర్వేషన్లతో కలుపుకొని ఇకపై 60 శాతం రిజర్వేషన్లు అమలవుతాయని సీఎం కేసీఆర్ తెలిపారు.
ఆర్థికంగా వెనుకబడినవర్గాలను ఆదుకొనేందుకు కేంద్ర ప్రభుత్వం 2019లో 103 వ రాజ్యాంగ సవరణ ద్వారా EWS లకు పదిశాతం రిజర్వేషన్లు కల్పించింది. 19 రాష్ట్రాలు, 7 కేంద్రపాలిత ప్రాంతాలు ఈ చట్టాన్ని ఇప్పటికే అమలుచేస్తున్నాయి. తెలంగాణలో కూడా దాదాపుగా ఇదేవిధంగా EWS రిజర్వేషన్లను అమలుచేస్తామని సీఎం కేసీఆర్ వెల్లడించారు.
Read more:
ఏపీ ఎస్‌ఈసీ కడప జిల్లా పర్యటన రద్దు.. హుటా హుటిన హైదరాబాద్ ఆస్పత్రికి నిమ్మగడ్డ రమేష్ కుమార్