తెలుగుదేశం పార్టీకి మరో షాక్ తగిలింది. ఎమ్మెల్యేలు, ఎంపీలు వరుసపెట్టి రాజీనామాలు చేస్తున్నారు. తాజాగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టీడీపీ అధ్యక్షుడు కోనేరు సత్యనారాయణ ఆ పార్టీకి గుడ్ బై చెప్పారు. ఈ నెల 18న హైదరాబాద్‌లో జరుగనున్న బీజేపీ బహిరంగ సభలో ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ నడ్డా నేతృత్వంలో.. కమలం గూటికి చేరనున్నట్లు ఆయన ప్రకటించారు. గతంలో టీఆర్ఎస్ అధినేత కేసీఆర్, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు 2014 ఎన్నికల సమయంలో టీఆర్ఎస్‌లో చేరవలసిందిగా ఆయన్ను కోరగా.. అందుకు అంగీకరించలేదు. కొత్తగూడెం నియోజకవర్గం నుంచి టీఆర్ఎస్ తరపున పోటీ చేసేందుకు ఆఫర్ కూడా ఇచ్చారు అయినప్పటికీ ఆయన టీడీపీని వీడలేదు. తాజాగా వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో.. టీడీపీకి భవిష్యత్తు లేదని భావించిన ఆయన బీజేపీలో చేరేందుకు రెడీ అయినట్లు ప్రకటించారు.