ఐటీ దాడులపై ఈసీకి ఫిర్యాదు చేసిన టీడీపీ

తమ పార్టీ అభ్యర్థుల ఇళ్లపై ఐటీ దాడుల నేపథ్యంలో ఎన్నికల సంఘానికి టీడీపీ ఫిర్యాదు చేసింది. ఈ మేరకు ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్ ఆధ్వర్యంలో టీడీపీ ప్రతినిధులు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి గోపాలకృష్ణ ద్వివేదికి వినతి పత్రం అందజేశారు. టీడీపీ అభ్యర్థులపై ఉద్దేశపూర్వకంగానే ఐటీ దాడులు జరుపుతున్నారని వారు ఫిర్యాదులో పేర్కొన్నారు. నామినేషన్ తర్వాత ఐటీ దాడులు జరపడం ఎన్నికల ప్రవర్తన నియమావళి ఉల్లంఘన కిందకి వస్తుందని వారు అభిప్రాయపడ్డారు. కాగా ఈ ఫిర్యాదుపై ఎన్నికల సంఘం […]

ఐటీ దాడులపై ఈసీకి ఫిర్యాదు చేసిన టీడీపీ
Follow us

| Edited By:

Updated on: Apr 04, 2019 | 4:19 PM

తమ పార్టీ అభ్యర్థుల ఇళ్లపై ఐటీ దాడుల నేపథ్యంలో ఎన్నికల సంఘానికి టీడీపీ ఫిర్యాదు చేసింది. ఈ మేరకు ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్ ఆధ్వర్యంలో టీడీపీ ప్రతినిధులు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి గోపాలకృష్ణ ద్వివేదికి వినతి పత్రం అందజేశారు.

టీడీపీ అభ్యర్థులపై ఉద్దేశపూర్వకంగానే ఐటీ దాడులు జరుపుతున్నారని వారు ఫిర్యాదులో పేర్కొన్నారు. నామినేషన్ తర్వాత ఐటీ దాడులు జరపడం ఎన్నికల ప్రవర్తన నియమావళి ఉల్లంఘన కిందకి వస్తుందని వారు అభిప్రాయపడ్డారు. కాగా ఈ ఫిర్యాదుపై ఎన్నికల సంఘం స్పందించింది. ఈ దాడులపై ఐటీ అధికారులతో సీఈవో ద్వివేది ఫోన్‌లో వివరణ కోరారు. దీనిపై నోటీసులు పంపుతామని.. దాడులపై లిఖిత పూర్వక వివరణ ఇవ్వాలంటూ ఐటీ అధికారులను ద్వివేది ఆదేశించారు.