పింక్ శారీలో పిచ్చెక్కిస్తున్న  నేహా శెట్టి

Phani.ch

07 May 2024

నేహా శెట్టి గురించి తెలుగు ప్రజలకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. ప్రస్తుతం టాలీవుడ్ లో ప్రస్తుతం యువతకు యూత్ క్రాష్ లా మారింది ఈ ముద్దుగుమ్మ .

ఈ మధ్య కాలంలో కన్నడ భామల తాకిడి మన టాలీవుడ్ లో ఎక్కువగానే ఉంటుంది. 2016లో ఓ కన్నడ సినిమాతోనే హీరోయిన్ గా ఆమె తన ప్రయాణాన్ని మొదలుపెట్టింది.

ఆకాశ్ పూరి హీరోగా నటించిన మెహబూబా సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది నేహా శెట్టి. తరువాత 'డీజే టిల్లు'  లో నటించి విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకుంది ఈ చిన్నది.

తరువాత బెదురులంక, రూల్స్ రంజన్, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి చిత్రాల్లో నేహా శెట్టి ఆఫర్స్ అందుకుంది. ప్రస్తుతం నిర్మాతలు నేహా శెట్టి డేట్స్ కోసం క్యూ కడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.

ఇటీవల విడుదలైన టిల్లు స్క్వేర్ మరల కనిపించి సందడి చేసింది ఈ ముద్దుగుమ్మ. మోడ్రన్ డ్రెస్ లలోనే కాదు, చీరకట్టులోను ఈ ముద్దుగుమ్మ అందాలు చూడటానికి రెండు కళ్ళు చాలవనే చెప్పాలి.

రూల్స్ రంజన్ చిత్రంలో నైట్ టైంలో స్విమ్మింగ్ పూల్ లో సమ్మోహనుడా అనే సాంగ్ లో హాట్ డాన్స్ తో కుర్రకారుకు కునుకు లేకుండా చేసింది నేహా శెట్టి.

ప్రస్తుతం విశ్వక్ సేన్, నేహాశెట్టి, అంజలి ప్రధానపాత్రల్లో నటిస్తున్న చిత్రం గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి. ఈ సినిమా త్వరలోనే విడుదలకు సిద్ధంగా ఉంది.