ఏపీ సీఎం జగన్ ఒక్కరోజు ఆదాయం ఎంతో తెలుసా..? ఆ సీక్రెట్ చెప్పేసిన జేసీ దివాకర్ రెడ్డి

| Edited By: Team Veegam

Mar 14, 2021 | 6:46 PM

రాజకీయాల్లో సంచలనాలకు మారుపేరుగా మారిన టీడీపీ సీనియర్‌ నేత, మాజీ ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి మరోసారి హాట్‌ కామెంట్స్‌ చేశారు. అయితీ ఆయన ఈసారి ఏకంగా

ఏపీ సీఎం జగన్ ఒక్కరోజు ఆదాయం ఎంతో తెలుసా..? ఆ సీక్రెట్ చెప్పేసిన జేసీ దివాకర్ రెడ్డి
Follow us on

రాజకీయాల్లో సంచలనాలకు మారుపేరుగా మారిన టీడీపీ సీనియర్‌ నేత, మాజీ ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి మరోసారి హాట్‌ కామెంట్స్‌ చేశారు. అయితీ ఆయన ఈసారి ఏకంగా ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ ఆదాయంపై కామెంట్‌ చేయడం సంచలనంగా మారింది.

మంగళవారం నాడు అనంతపురంలో మీడియాతో మాట్లాడుతూ సీఎం జగన్ ఒక రోజు ఆదాయం రూ. 300 కోట్లు అని షాకింగ్ కామెంట్స్ చేశారు. అయితే ఇది ఎంతవరకు నిజమో..? అబద్ధమో..? తెలియదన్నారు. ప్రజల్లో విస్తృతంగా ప్రచారం జరుగుతున్న అంశాన్నే తాను చెబుతున్నానన్నారు జేసీ.

ప్రతీ ఎన్నికల్లో డబ్బు ప్రభావంతోనే ఎన్నికల్లో జగన్‌ గెలుస్తారని చెప్పారు. టీడీపీ అధినేత చంద్రబాబు తన సొంత నియోజకవర్గం కుప్పంను బాగా అభివృద్ధి చేశారని.. డబ్బులు పంచలేకే ఓడిపోయారన్నారు. అక్కడ అధికార పార్టీ డబ్బుకు తోడు పోలీసులు కూడా భయబ్రాంతులకు గురిచేశారన్నారు. అభివృద్ధి చూసి వైసీపీకి ఓటేశారని చెప్పడం అబద్ధమని జేసీ చెప్పుకొచ్చారు.