వైసీపీ సర్కారుకి హైకోర్టు తీర్పు చెంపపెట్టన్న బాబు, ఎన్నికల సంఘం ప్రభుత్వానికి రబ్బరు స్టాంపులా మారకూడదని హితవు

|

Apr 06, 2021 | 11:01 PM

TDP Chief chandrababu reaction on High Court stay : 13 నెలలు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్లు ముగ్గురు. రెండుసార్లు వాయిదా. ‌

వైసీపీ సర్కారుకి హైకోర్టు తీర్పు చెంపపెట్టన్న బాబు, ఎన్నికల సంఘం ప్రభుత్వానికి రబ్బరు స్టాంపులా మారకూడదని హితవు
Follow us on

TDP Chief chandrababu reaction on High Court stay : 13 నెలలు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్లు ముగ్గురు. రెండుసార్లు వాయిదా. అప్పుడు కరోనా కారణంగా జరగలేదు. ఇప్పుడు హైకోర్టు బ్రేక్‌ వేసింది. పోలింగ్‌కి సరిగ్గా 40 గంటల ముందు పరిషత్‌ ఎన్నికలు డైలమాలో పడ్డాయి. ఆ వెంటనే మళ్లీ ధర్మాసనం ముందు అప్పీల్‌ పిటిషన్‌ దాఖలైంది. దానిపైనే ఇప్పుడు సస్పెన్స్‌ కొనసాగుతోంది.ఎల్లుండి జరగాల్సిన ZPTC, MPTC ఎన్నికలకు బ్రేక్‌లు పడ్డాయి. నోటిఫికేషన్‌ను రద్దు చేసింది హైకోర్టు సింగిల్‌ జడ్జి బెంచ్‌. గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన మార్గదర్శకాలకు అనుగుణంగా నోటిఫికేషన్‌ లేదని భావించి నిలుపుదల చేసింది. సుప్రీంకోర్టు ఇచ్చిన 4 వారాల ఎన్నికల కోడ్‌ను అమలు చేసేలా చూడాలని SECకి సూచించింది. దీంతో పరిషత్‌ ఎన్నికలకు బ్రేక్‌లు పడ్డాయి.

హైకోర్టు సింగిల్‌ జడ్జి బెంచ్‌ ఇచ్చిన తీర్పుపై డివిజన్‌ బెంచ్‌లో అప్పీల్‌కు వెళ్లింది SEC. గురువారమే పోలింగ్‌ ఉండటంతో… ఎన్నికలు జరిగేలా ఆదేశాలు ఇవ్వాలని హౌస్‌ మోషన్‌ పిటిషన్‌ వేసింది. దీనిపై ఎలాంటి తీర్పు వస్తుందోనన్న ఉత్కంఠ కొనసాగుతోంది. ఈ నెల 1వ తేదీన పరిషత్‌ ఎన్నికలపై SEC నీలం సాహ్ని ఇచ్చిన నోటిఫికేషన్‌పై హైకోర్టుకు వెళ్లాయి బీజేపీ, టీడీపీ. తెలుగుదేశం నేత వర్ల రామయ్య వేసిన పిటిషన్‌లో ఉత్తర్వులు జారీ చేసింది ధర్మాసనం. దీనిపై SEC అప్పీల్‌కు వెళ్లడాన్ని కూడా తప్పుబట్టింది టీడీపీ.

హైకోర్టు తీర్పును తెలుగుదేశం స్వాగతించింది. ఎన్నికలను బహిష్కరించాలన్న తమ నిర్ణయం సరైందేనని ఈ తీర్పుతో రుజువైందని అభిప్రాయపడ్డారు చంద్రబాబు. పరిషత్ ఎన్నికల నిలుపుదల రాజ్యాంగ విజయం అని బాబు అభివర్ణించారు. వైసీపీ ప్రభుత్వ అరాచకానికి హైకోర్టు తీర్పు చెంపపెట్టు వంటిదన్నారు. పరిషత్ ఎన్నికలను బహిష్కరించాలని టీడీపీ తీసుకున్న నిర్ణయం ఇప్పుడు సరైనదేనని రుజువైందని వెల్లడించారు. ఎస్ఈసీ చట్టప్రకారం స్వతంత్రంగా వ్యవహరించాలని, ప్రభుత్వానికి రబ్బరు స్టాంపులా మారకూడదని చంద్రబాబు హితవు పలికారు. పరిషత్ ఎన్నికలకు నోటిఫికేషన్ ఇచ్చి ఏడాది దాటిందని, కొత్త ఓటర్లకు కూడా అవకాశం ఇచ్చేలా తాజా నోటిఫికేషన్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు చంద్రబాబు. మళ్లీ ప్రక్రియను మొదటి నుంచి చేపట్టాలని డిమాండ్‌ చేశారు. టీడీపీ వాదనను తప్పుబట్టింది వైసీపీ. అసలు ఆటలో లేని ప్లేయర్‌కు ఆట గురించి మాట్లాడే హక్కు లేదన్నారు ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి.

Read also : షర్మిల సంకల్ప సభకు చకచకా ఏర్పాట్లు, తండ్రి పాదయాత్ర షురూ చేసిన రోజే పార్టీ ప్రకటన, సంచలనాలకూ అదే ముహూర్తం.!