తణుకు మాజీ ఎమ్మెల్యే వైటీ రాజా కన్నుమూత.. కరోనా నుంచి కోలుకున్నప్పటికీ..!

తణుకు మాజీ ఎమ్మెల్యే యలమర్తి తిమ్మ రాజా(వైటీ రాజా) కన్నుమూశారు. అనారోగ్యానికి గురై హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన

తణుకు మాజీ ఎమ్మెల్యే వైటీ రాజా కన్నుమూత.. కరోనా నుంచి కోలుకున్నప్పటికీ..!

Updated on: Nov 15, 2020 | 8:59 AM

YT Raja passes away: తణుకు మాజీ ఎమ్మెల్యే యలమర్తి తిమ్మ రాజా(వైటీ రాజా) కన్నుమూశారు. అనారోగ్యానికి గురై హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన.. పరిస్థితి దిగజారడంతో ఈ ఉదయం తుది శ్వాస విడిచారు. ఇటీవల వైటీ రాజాకు కరోనా సోకగా.. ఆ తరువాత ఆ వైరస్‌ని జయించారు. కానీ పదిరోజుల తరువాత తిరిగి అస్వస్థతకు గురవ్వడంతో ఆసుపత్రిలో చేరారు. (బైక్‌ షోరూమ్‌లో భారీ అగ్నిప్రమాదం.. మంటలను ఆర్పేందుకు వెళ్లిన ముగ్గురు సిబ్బందికి గాయాలు)

కాగా టీడీపీ తరఫున 1999-2004 వరకు తణుకు ఎమ్మెల్యేగా వైటీ రాజా పనిచేశారు. తణుకు కన్జ్యూమార్‌ స్టోర్స్‌ అధ్యక్షుడిగానూ ఆయన పనిచేశారు. ఇక వైటీ రాజా మరణ వార్త తెలిసిన మాజీ సీఎం చంద్రబాబు నాయుడుతో సహా పలువురు రాజకీయ ప్రముఖులు విచారం వ్యక్తం చేశారు. వైటీ రాజా ఆత్మకు శాంతి చేకూరాలని వారు సంతాపం తెలిపారు. (ప్రపంచవ్యాప్తంగా ఒక్కరోజే 6.5లక్షలకు పైగా కేసులు.. ఇదే తొలిసారి అన్న డబ్ల్యూహెచ్‌వో)

Loading...
Unable to load recommendations.
Follow Us