ఏపీలో జగన్ సీఎం కావడం ఖాయం: టీఎస్ మంత్రి తలసాని

ఏపీలో వైఎస్ జగన్ సీఎం కావడం ఖాయమని అన్నారు టీఆర్ఎస్ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. ఏపీలో వైసీపీకి 125 నుంచి 130 అసెంబ్లీ  సీట్లు, 18 నుంచి 23 ఎంపీ సీట్లు వస్తాయని తలసాని పేర్కొన్నారు. జాతీయ సర్వేలు అన్నీ ఇదే చెబుతున్నాయని అన్నారు. ఏపీలో టీడీపీని ప్రజలు నమ్మే పరిస్థితి లేదని అన్నారు తలసాని శ్రీనివాస్. సీఎం చంద్రబాబు ఎన్నికల ప్రచారమంతా సీఎం కేసీఆర్‌ను తిట్టడమే టార్గెట్‌గా పెట్టుకున్నారని మండిపడ్డారు తలసాని. అభివృద్ధి చేశాం […]

ఏపీలో జగన్ సీఎం కావడం ఖాయం: టీఎస్ మంత్రి తలసాని

Edited By:

Updated on: Mar 27, 2019 | 11:16 AM

ఏపీలో వైఎస్ జగన్ సీఎం కావడం ఖాయమని అన్నారు టీఆర్ఎస్ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. ఏపీలో వైసీపీకి 125 నుంచి 130 అసెంబ్లీ  సీట్లు, 18 నుంచి 23 ఎంపీ సీట్లు వస్తాయని తలసాని పేర్కొన్నారు. జాతీయ సర్వేలు అన్నీ ఇదే చెబుతున్నాయని అన్నారు. ఏపీలో టీడీపీని ప్రజలు నమ్మే పరిస్థితి లేదని అన్నారు తలసాని శ్రీనివాస్. సీఎం చంద్రబాబు ఎన్నికల ప్రచారమంతా సీఎం కేసీఆర్‌ను తిట్టడమే టార్గెట్‌గా పెట్టుకున్నారని మండిపడ్డారు తలసాని. అభివృద్ధి చేశాం కనుకనే ప్రజలు కేసీఆర్‌కు పట్టం కట్టారని అని తెలిపారు.

కాగా.. కావాలనే రెండు ప్రాంతాల మధ్య విద్వేషాలు రెచ్చగొడుతున్నారని తలసాని తెలిపారు. ఏపీ ప్రజలపై దాడులు చేస్తున్నారంటున్న పవన్.. నిన్నటి వరకు హైదరాబాద్‌లో లేరా..? ఎప్పుడైనా పవన్‌పై దాడులు జరిగాయా..? అని ప్రశ్నించారు తలసాని. అయినా.. 80శాతం టీడీపీ నేతల ఆస్తులు మొత్తం హైదరాబాద్‌లోనే ఉన్నాయి. మేం బెదిరిస్తే ప్రశాంతంగా వ్యాపారాలెలా చేసుకుంటున్నారు.. అని టీడీపీకి చురకలంటించారు. ఏపీ రాజకీయాలన్నీ కేసీఆర్ చుట్టే తిరుగుతున్నాయని.. వచ్చే సమయం వచ్చినప్పుడు రాక తప్పదని అని అన్నారు టీఆర్ఎస్ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్.