కాంగ్రెస్ నేతలపై తలసాని ఆగ్రహం

కాంగ్రెస్ నేతలపై మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ నిప్పులు చెరిగారు. కాంగ్రెస్‌ నేతలు ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. అలీబాబా 40 దొంగలు గవర్నర్‌కు ఫిర్యాదు చేశారని ఎద్దేవాచేశారు. గతంలో టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలను కాంగ్రెస్‌లో చేర్చుకోలేదా అని తలసాని ప్రశ్నించారు. ప్రజాప్రతినిధులనుకొనే సాంప్రదాయం కాంగ్రెస్‌దేనని దుయ్యబట్టారు. ప్రజాస్వామ్యాన్ని గౌరవించడం కూడా కాంగ్రెస్‌ నేతలకు తెలియదని, టీ-కాంగ్రెస్‌ నేతలు దద్దమ్మల్లా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. టీఆర్‌ఎస్‌ ఆవిర్భావ దినోత్సవాన్ని నిరాడంబరంగా నిర్వహిస్తామని, కాళేశ్వరం ప్రాజెక్ట్‌ తెలంగాణ రైతులకు జీవనాడి అని అన్నారు. […]

కాంగ్రెస్ నేతలపై తలసాని ఆగ్రహం

Edited By:

Updated on: Apr 26, 2019 | 6:30 PM

కాంగ్రెస్ నేతలపై మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ నిప్పులు చెరిగారు. కాంగ్రెస్‌ నేతలు ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. అలీబాబా 40 దొంగలు గవర్నర్‌కు ఫిర్యాదు చేశారని ఎద్దేవాచేశారు. గతంలో టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలను కాంగ్రెస్‌లో చేర్చుకోలేదా అని తలసాని ప్రశ్నించారు. ప్రజాప్రతినిధులనుకొనే సాంప్రదాయం కాంగ్రెస్‌దేనని దుయ్యబట్టారు. ప్రజాస్వామ్యాన్ని గౌరవించడం కూడా కాంగ్రెస్‌ నేతలకు తెలియదని, టీ-కాంగ్రెస్‌ నేతలు దద్దమ్మల్లా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. టీఆర్‌ఎస్‌ ఆవిర్భావ దినోత్సవాన్ని నిరాడంబరంగా నిర్వహిస్తామని, కాళేశ్వరం ప్రాజెక్ట్‌ తెలంగాణ రైతులకు జీవనాడి అని అన్నారు.