‘ బలం మాదే 1 గెలిచి తీరుతాం ‘! సోనియా ధీమా

|

Nov 26, 2019 | 8:04 PM

మహారాష్ట్రలో 24 గంటల్లో బల పరీక్ష నిర్వహించాలని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు పట్ల కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ హర్షం ప్రకటించారు. ఈ పరీక్షలో తమదే విజయమని, రేపు ఏం జరగబోతోందో వేచి చూడండని ఆమె మీడియాతో అన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు కాంగ్రెస్ పార్టీతో బాటు శివసేన, శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ ‘ మహారాష్ట్ర వికాస్ అఘాడీ ‘ పేరిట కూటమిని ఏర్పాటు చేసిన విషయం విదితమే.. తమకు 162 మంది ఎమ్మెల్యేల […]

 బలం మాదే 1 గెలిచి తీరుతాం ! సోనియా ధీమా
Follow us on

మహారాష్ట్రలో 24 గంటల్లో బల పరీక్ష నిర్వహించాలని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు పట్ల కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ హర్షం ప్రకటించారు. ఈ పరీక్షలో తమదే విజయమని, రేపు ఏం జరగబోతోందో వేచి చూడండని ఆమె మీడియాతో అన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు కాంగ్రెస్ పార్టీతో బాటు శివసేన, శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ ‘ మహారాష్ట్ర వికాస్ అఘాడీ ‘ పేరిట కూటమిని ఏర్పాటు చేసిన విషయం విదితమే.. తమకు 162 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని ఈ కూటమి ప్రకటించుకుంది. సుప్రీంకోర్టు మంగళవారం తీర్పు నిచ్చిన అనంతరం.. తామే సభలో మెజారిటీని ప్రూవ్ చేసుకోగలుగుతామని, ఆ తరువాత రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ఈ కూటమి ఆశిస్తోంది.
ఫ్లోర్ టెస్ట్ ఇంకా జాప్యం జరిగే పక్షంలో బేరసారాలకు అవకాశం ఉంటుందని, అందువల్ల ప్రజాస్వామ్య విలువల పరిరక్షణకు అనుగుణంగా కోర్టు నడుచుకోవాల్సిన అవసరం ఉందని ముగ్గురు సభ్యుల ధర్మాసనం పేర్కొంది. అలాంటప్పుడు సంబంధిత పార్టీ తక్షణం మెజారిటీని నిరూపించుకోవలసిన అవసరం ఉందని తాము భావిస్తున్నామని న్యాయమూర్తులు వ్యాఖ్యానించారు. ఎన్సీపీ నేత శరద్ పవార్ కూడా అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన ఉత్తర్వులను స్వాగతించారు. రాజ్యాంగ దినోత్సవం నాడు జారీ అయిన ఈ ఆదేశాలు బాబా సాహెబ్ అంబెడ్కర్ కు నివాళి అని ట్వీట్ చేశారు.
ఇదిలా ఉండగా ఈ రాత్రి 9 గంటలకు తమ ఎమ్మెల్యేలంతా ముంబై లోని గర్వారే స్పోర్ట్స్ క్లబ్ కు చేరుకోవాలని బీజేపీ పిలుపునిచ్చింది. ఈ పార్టీ నుంచి 105 మంది ఎమ్మెల్యేలుగా గెలిచిన విషయం గమనార్హం. సోమవారం రాత్రి ఏడు గంటల ప్రాంతంలో సేన-కాంగ్రెస్,ఎన్సీపీ తమ 162 మంది సభ్యులను ఓ ఫైవ్ స్టార్ హోటల్లో పరేడ్ చేయించాయి .