శాసనసభ, లోక్‌సభ ఎన్నికలకు పోలింగ్ ముహూర్తం ఖరారు కావడంతో ఏపీలో రాజకీయం ఒక్కసారిగా వెడెక్కింది. ఈ నేపథ్యలోనే టీడీపీ నేతలతో సీఎం చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఎన్నికలకు కేవలం 30 రోజులే ఉన్నా.. సమర్థంగా పనిచేస్తామన్నారు. బాబు. ‘మీ భవిష్యత్తు – మా బాధ్యత’ అన్న నినాదంతో ముందుకు వెళ్దామని.. నేతలకు పిలుపునిచ్చారు. రాబోయే ఐదేళ్లు మళ్లీ తమే అధికారంలోకి వచ్చేదన్నారు. ఐతే మోడీ, కేసీఆర్, జగన్‌లు కుట్రలు చేసే పనుల్లో నిమగ్నం అయ్యారన్నారు. ఎలాగైనా వీరి కుట్రలను తిప్పికొట్టాలన్నారు బాబు. ఐతే ప్రజలు తమ ఓట్లను తనిఖీ చేసేందుకు. 1950 అనే టోల్ ఫ్రీ నెంబర్‌కు ఫోన్ చేసి తమ ఓటును తెలుసుకోవచ్చని అన్నారు.