ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సంఘం కమిషనర్ నిమ్మగడ్డ రమేష్‌కుమార్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. తనపై అనుచిత వ్యాఖ్యలు చేసిన మంత్రి పెద్దిరెడ్డిని ఇంట్లో నుంచి బయటకు రానివ్వకుండా చూడాలని డీజపీ గౌతమ్ సవాంగ్‌ను ఆదేశించారు. ఈ నెల 21వ తేదీ వరకు ఆయన్ను హౌస్ అరెస్ట్ చేయాలన్నారు. మీడియాతో కూడా మాట్లాడనివ్వద్దని స్పష్టం చేశారు. ఆర్టికల్ 243తోపాటు, సుప్రీంకోర్టు గైడ్‌లైన్స్‌నూ డీజీపీకి రాసిన లేఖలో నిమ్మగడ్డ ప్రస్తావించారు.
చిత్తూరు జిల్లాలో ఏకగ్రీవాలను ఆపాలని నిన్న ఆదేశాలు జారీ చేశారు నిమ్మగడ్డ రమేష్‌కుమార్. దీనిపై తీవ్ర స్థాయిలో స్పందించిన పెద్దిరెడ్డి.. ఎస్‌ఈసీ నిమ్మగడ్డపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. ఏకగ్రీవాలు కావొద్దని ఏ రాజ్యాంగంలో ఉందో చెప్పాలని పెద్దిరెడ్డి డిమాండ్ చేశారు. నిమ్మగడ్డ చెప్పినట్లు చేసి… నిబంధనలను పట్టించుకోని అధికారులపై ఎన్నికల తర్వాత చర్యలు తీసుకుంటామని పెద్దిరెడ్డి హెచ్చరించడం సంచలనంగా మారింది.
మంత్రి పెద్దిరెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలకు స్పందినగా ఎస్‌ఈసీ సంచలన నిర్ణయం తీసుకున్నారు. పెద్దిరెడ్డిని ఇంటికే పరిమితం చేయాలని ఆదేశాలు జారీ చేశారు. అయితే ఎస్‌ఈసీ ఇచ్చిన ఆదేశాలను తాను ఇంకా చూడలేదన్నారు డీజీపీ గౌతమ్ సవాంగ్. వాటిని పరిశీలించిన తర్వాత మాట్లాడతానన్నారు.
అటు ఎస్‌ఈసీ నిమ్మగడ్డ నిర్ణయంపై మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబుకు బంట్రోతులా నిమ్మగడ్డ పని చేస్తున్నారని ఫైర్ అయ్యారు. నిమ్మగడ్డ అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని చెప్పారు. నిమ్మగడ్డ ఆదేశాలను పట్టించుకోకుండా అధికారులు స్వేచ్ఛగా పని చేయాలని పెద్దిరెడ్డి కోరారు. నిమ్మగడ్డకు ప్రజలే బుద్ది చెబుతారని, ఆయనకు ప్రాయశ్చిత్తం తప్పదని పెద్దిరెడ్డి హెచ్చరించారు.
Read more:
AP IAS Transfers: ఏపీలో పలువురు ఐఏఎస్‌లను బదిలీ సర్కార్ ఉత్తర్వులు.. వివరాలు ఇవిగో
Photographer overaction: ఈ వీడియో చూస్తే.. నవ్వుతో మీ పొట్ట చెక్కలవ్వడం ఖాయం.. అతికి అదిరిపోయే దెబ్బ