ఎన్నికలు నిష్పక్షపాతంగా నిర్వహించాలి.. తమకు తాము ఆంక్షలు పెట్టుకున్నామన్న వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి

|

Jan 26, 2021 | 5:24 PM

ఏపీలో పంచాయతీ ఎన్నికలను నిష్పక్షపాతంగా నిర్వహించాల్సిన బాధ్యత ఎస్‌ఈసీదేనని వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి

ఎన్నికలు నిష్పక్షపాతంగా నిర్వహించాలి.. తమకు తాము ఆంక్షలు పెట్టుకున్నామన్న వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి
Follow us on

ఏపీలో పంచాయతీ ఎన్నికలను నిష్పక్షపాతంగా నిర్వహించాల్సిన బాధ్యత ఎస్‌ఈసీదేనని వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. ఇప్పుడు ఆయన ఎన్ని ఇబ్బందులైనా పెట్టొచ్చని వ్యాఖ్యానించారు. ఎన్నికల సంస్కరణలతో తమకు తాము ఆంక్షలు పెట్టుకున్నామని, ఇప్పుడు ఎవరు తప్పు చేసినా శిక్ష తప్పదన్నారు.

తాడేపల్లి వైసీపీ ఆఫీసులో గణతంత్ర వేడుకలు జరిగాయి. జాతీయ జెండాను ఎగురవేసిన అనంతరం సజ్జల ఈ వ్యాఖ్యలు చేశారు. రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్‌ను అందరం గుర్తుంచుకోవాలని తెలిపారు. సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తీసుకొచ్చిన మార్పు, రాజ్యాంగ నిర్మాతల ఆకాంక్షలకు అనుగుణంగా నిలిచిందని కొనియాడారు.

పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో అధికారంలో ఉన్నప్పటికీ, చట్టంలో జగన్‌ తెచ్చిన మార్పు రాజ్యాంగ స్ఫూర్తికి నిదర్శనమని అన్నారు. దేశంలో కోరుకుంటున్న మార్పును తొలిసారి ప్రభుత్వం చేసిందని పేర్కొన్నారు. ఎన్నికల్లో ఎవరు డబ్బు, మద్యం పంపిణీ చేసినా అతని ఎన్నిక రద్దు, రెండేళ్ల జైలు తప్పదని తెలిపారు. ఎన్నికలు నిర్వహించాల్సిన వారు నిష్పక్షపాతంగా నిర్వహించాలని సజ్జల అన్నారు