ఈ నెల 11న జీహెచ్ఎంసీ పాలకమండలి ప్రమాణస్వీకారం.. సభ్యులు ఏం చేయొచ్చు.. ఏం చేయరాదు..

|

Feb 08, 2021 | 5:28 PM

ఈనెల 11న బల్దియా సమావేశం కానుంది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ నూతన పాలక మండలి సభ్యుల ప్రమాణ స్వీకారంతోపాటు..

ఈ నెల 11న జీహెచ్ఎంసీ పాలకమండలి ప్రమాణస్వీకారం.. సభ్యులు ఏం చేయొచ్చు.. ఏం చేయరాదు..
Follow us on

ఈనెల 11న బల్దియా సమావేశం కానుంది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ నూతన పాలక మండలి సభ్యుల ప్రమాణ స్వీకారంతోపాటు మేయర్, డిప్యూటీ మేయర్‌లను ఎన్నుకోనున్నారు. ఈ నేపథ్యంలో సమావేశానికి సంబంధించి అన్ని ఏర్పాట్లను చేశామని జీహెచ్ఎంసీ ఎన్నికల అధికారి తెలిపారు. కొత్తగా ఎన్నికైన కార్పొరేటర్లు సమావేశానికి హాజరు కావడానికి పలు సూచనలను చేశారు.

ఈ నెల 11 వ తేదీ ఫిబ్రవరి 10:45 గంటల వరకు కౌన్సిల్ హాల్ కు చేరుకోవాలి. ప్రతీ సభ్యుడు తమ ఫోటో కలిగిన ఏదేని గుర్తింపు కార్డు తప్పని సరిగా తీసుకు రావాల్సి ఉంటుంది. సమావేశం నిర్వహణను తెలియ చేస్తూ ఇప్పటికే జీహెచ్ఎంసీ పంపిన లేఖను కూడా సభ్యులు తీసుకురావాలి. ఉదయం 11 గంటలకు సభ్యుల ప్రమాణ స్వీకారం నిర్వ హించడం జరుగుతుంది. సమావేశానికి కేవలం సభ్యులను మాత్రమే అనుమతిస్తామని, బంధువులను గాని, అనుచరులను గానీ ఎట్టిపరిస్థితుల్లో అనుమతించమని ఎన్నికల అధికారి తెలిపారు.

సమావేశానికి హాజరయ్యే ప్రతీ సభ్యులు తప్పని సరిగా కోవిడ్‌ నిబంధనలను పాటించాలి. మాస్క్ లను ధరించాలి. కౌన్సిల్ హాల్ లో పార్టీల ప్రాతిపదికగా సభ్యులకు తమ వార్డుల పేర్లను తెలియచేస్తూ రాష్ట్ర ఎన్నికల సంఘం సూచనల మేరకు అక్షర క్రమంలో కేటాయించిన సీట్లలో కూర్చోవాలి. ప్రతి లైన్ లో సహాయకారిగా ఉండేందుకు రో-అధికారుల నియమించాం. ప్రతి సభ్యుడు ఏ సీటులో కూర్చోవాలో అధికారులు తెలియజేస్తారు.

సమావేశంపై ఏదైన సందేహాలు ఉంటే జిహెచ్ఎంసి ఎన్నికల విభాగం అధికారులను గానీ, సెక్రటరిని గాని సంప్రదించవచ్చు. మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికల పక్రియ నిర్వహణపై వివరించేందుకు 9 .2 .2021 (మంగళవారం ) జిహెచ్ఎంసిలో ప్రాతినిధ్యం వహించే రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించి మేయర్, డిప్యూటి మేయర్ ఎన్నికల విధానాన్ని తెలియజేస్తామని ఎన్నికల అధికారి వెల్లడించారు.

 

Read more:

బండీ బడాయిలు ఆపవయా.. ఆ ఆరోపణలు నిరూపిస్తే రాజీనామాకు సిద్ధం.. నీవు సిద్ధమా.. బీజేపీ ఎంపీకి టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే సవాల్‌