అన్నను జాగ్రత్తగా చూసుకోండి- ప్రియాంక గాంధీ

వయనాడ్‌: కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ గురువారం వయనాడ్‌ నుంచి నామినేషన్‌ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఆయన వెంట సోదరి, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ కూడా ఉన్నారు. నామినేషన్ అయ్యేంతవరకు ప్రియాంక రాహుల్‌కి తోడుగా ఉన్నారు. వయనాడ్ వ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులు రాహుల్‌కు భారీ స్వాగతం పలికారు. నామినేషన్‌ అనంతరం ప్రియాంక ట్విటర్‌లో ఓ ఉద్వేగపూరితమైన సందేశాన్ని పోస్ట్‌ చేశారు. ‘‘నా సోదరుడు నాకు నిజమైన మిత్రుడు.. నాకు తెలిసినంత వరకు చాలా […]

అన్నను జాగ్రత్తగా చూసుకోండి- ప్రియాంక గాంధీ

Updated on: Apr 04, 2019 | 7:13 PM

వయనాడ్‌: కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ గురువారం వయనాడ్‌ నుంచి నామినేషన్‌ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఆయన వెంట సోదరి, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ కూడా ఉన్నారు. నామినేషన్ అయ్యేంతవరకు ప్రియాంక రాహుల్‌కి తోడుగా ఉన్నారు. వయనాడ్ వ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులు రాహుల్‌కు భారీ స్వాగతం పలికారు. నామినేషన్‌ అనంతరం ప్రియాంక ట్విటర్‌లో ఓ ఉద్వేగపూరితమైన సందేశాన్ని పోస్ట్‌ చేశారు. ‘‘నా సోదరుడు నాకు నిజమైన మిత్రుడు.. నాకు తెలిసినంత వరకు చాలా ధైర్యవంతుడు. వయనాడ్‌ ప్రజలారా.. అన్నను జాగ్రత్తగా చూసుకోండి. మిమ్మల్ని ఏమాత్రం నిరాశపరచరు’’ అని తన సోదరుడు రాహుల్‌ గురించి ప్రియాంక చెప్పుకొచ్చారు. ఈసారి అమేథీతో పాటు వయనాడ్‌ను రాహుల్‌ రెండో స్థానంగా ఎంచుకున్నారు. దక్షిణాదిలో పట్టు సాధించడమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. గాంధీ-నెహ్రూ కుటుంబం నుంచి దక్షిణాదిలో రెండో స్థానం ఎంచుకున్న మూడో వ్యక్తి రాహుల్‌ గాంధీ. గతంలో ఇందిరాగాంధీ, సోనియాగాంధీ దక్షిణాది నుంచి పోటీ చేశారు.