ఆదివారం ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో తన అధికారిక వాహనాన్ని పక్కనబెట్టిన పుణే మేయర్ ముక్తా తిలక్ ఈ విషయాన్ని ఫేస్‌బుక్ వేదికగా ప్రకటించారు. కారు వదిలేసి తన కార్యకర్త బైక్‌పై వెళుతున్నట్టు ఓ ఫోటోను కూడా పోస్టు చేశారు. అంతే ఆ ఫోటోతో కొత్త తలనొప్పి మొదలైంది.
ఆమెగానీ, పార్టీ కార్యకర్తగానీ బైక్ డ్రైవ్ చేస్తున్నప్పుడు హెల్మెట్ పెట్టుకోని విషయం నెటిజన్లు పసిగట్టి నిలిదీశారు. హెల్మెట్ ధరించని వేలాది మందికి జరిమానా విధిస్తున్నట్టే మేయర్‌కి కూడా జరిమానా విధించాలంటూ డిమాండ్ చేశారు. మేయర్‌పై చర్యలు తీసుకోవాలని పుణే ట్రాఫిక్ పోలీసులను ట్యాగ్ చేస్తూ పోస్టులు వెల్లువెత్తడంతో… వాహన యజమానికి రూ.500 జరిమాన విధిస్తూ పోలీసులు ఈ-చలాన్ జారీచేశారు.