పార్టీ కోరితే ఎన్నికల్లో పోటీ చేస్తానన్న ప్రియాంక‌

| Edited By:

Mar 27, 2019 | 8:25 PM

ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సోదరి, తూర్పు యూపీ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ లోక్‌సభ ఎన్నికల్లో పోటీకి తాను వ్యతిరేకం కాదంటూ సంకేతాలిచ్చారు. యూపీలో మూడు రోజుల పర్యటనలో భాగంగా బుధవారంనాడు ఆమె అమేథీకి వచ్చారు. ఈ సందర్భంగా లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేస్తారా అని అడిగినప్పుడు, పోటీపై ఇంకా నిర్ణయించుకోలేదని, అయితే పోటీ చేయమని పార్టీ కోరితే తప్పనిసరిగా పోటీ చేస్తానని చెప్పారు. పార్టీ కోసం పనిచేయాలన్నదే తన […]

పార్టీ కోరితే ఎన్నికల్లో పోటీ చేస్తానన్న ప్రియాంక‌
Follow us on

ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సోదరి, తూర్పు యూపీ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ లోక్‌సభ ఎన్నికల్లో పోటీకి తాను వ్యతిరేకం కాదంటూ సంకేతాలిచ్చారు. యూపీలో మూడు రోజుల పర్యటనలో భాగంగా బుధవారంనాడు ఆమె అమేథీకి వచ్చారు. ఈ సందర్భంగా లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేస్తారా అని అడిగినప్పుడు, పోటీపై ఇంకా నిర్ణయించుకోలేదని, అయితే పోటీ చేయమని పార్టీ కోరితే తప్పనిసరిగా పోటీ చేస్తానని చెప్పారు. పార్టీ కోసం పనిచేయాలన్నదే తన కోరిక అని ప్రియాంక స్పష్టం చేశారు. మూడురోజుల పర్యటనలో భాగంగా ఆమేథి, రాయబరేలి సహా పలు నియోజకవర్గాల్లో ప్రియాంక ప్రచారం సాగించనున్నారు. అయోధ్యలోని ప్రఖ్యాత హనుమాన్ ఆలయంలో ప్రత్యేక పూజల్లో పాల్గొంటారు.