ప్రజా సంక్షేమం పట్టించుకోకుండా.. టీషర్టులు అమ్ముకుంటున్న బీజేపీ : ప్రియాంక ట్వీట్

న్యూఢిల్లీ : కాంగ్రెస్‌ పార్టీ నాయకురాలు ప్రియాంక గాంధీ బీజేపీని లక్ష్యంగా చేసుకుని ట్విట్టర్ వేదికగా విమర్శలు గుప్పించారు. ప్రజల బాధలను పట్టించు కోకుండా బీజేపీ పార్టీ.. నమో యాప్‌, చౌకీదార్‌ టీ-షర్టులతో బాగానే మార్కెటింగ్‌ చేసుకుంటోందని ప్రియాంక గాంధీ మండిపడ్డారు. ఉత్తర్‌ ప్రదేశ్‌లో కాంట్రాక్ట్‌ టీచర్ల సమస్యలను పరిష్కరించకుండా కేంద్రంలో మోడీ ప్రభుత్వం, రాష్ట్రంలో యోగి ప్రభుత్వం నిర్లక్ష్య పాలన సాగిస్తున్నాయని ట్విట్టర్‌ వేదికగా విమర్శలు గుప్పించారు. గౌరవ వేతనం, అసిస్టెంట్‌ టీచర్‌ హోదా కోసం […]

ప్రజా సంక్షేమం పట్టించుకోకుండా.. టీషర్టులు అమ్ముకుంటున్న బీజేపీ : ప్రియాంక ట్వీట్

Edited By:

Updated on: Mar 26, 2019 | 5:46 PM

న్యూఢిల్లీ : కాంగ్రెస్‌ పార్టీ నాయకురాలు ప్రియాంక గాంధీ బీజేపీని లక్ష్యంగా చేసుకుని ట్విట్టర్ వేదికగా విమర్శలు గుప్పించారు. ప్రజల బాధలను పట్టించు కోకుండా బీజేపీ పార్టీ.. నమో యాప్‌, చౌకీదార్‌ టీ-షర్టులతో బాగానే మార్కెటింగ్‌ చేసుకుంటోందని ప్రియాంక గాంధీ మండిపడ్డారు. ఉత్తర్‌ ప్రదేశ్‌లో కాంట్రాక్ట్‌ టీచర్ల సమస్యలను పరిష్కరించకుండా కేంద్రంలో మోడీ ప్రభుత్వం, రాష్ట్రంలో యోగి ప్రభుత్వం నిర్లక్ష్య పాలన సాగిస్తున్నాయని ట్విట్టర్‌ వేదికగా విమర్శలు గుప్పించారు. గౌరవ వేతనం, అసిస్టెంట్‌ టీచర్‌ హోదా కోసం యూపీలో శిక్షా మిత్రాలు పోరాటం చేస్తుంటే ప్రభుత్వాలు పట్టించుకోకుండా.. ప్రతీరోజు వారిని అవమానిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తమను పట్టించుకోవడం లేదన్న మనస్థాపంతో కొంతమంది శిక్షా మిత్రాలు ఆత్మహత్యలు కూడా చేసుకుంటున్నారని ఆమె అన్నారు. న్యాయపరమైన డిమాండ్లు నెరవేర్చాలని శాంతియుతంగా ఆందోళన చేస్తున్న వారిపై లాఠీలు ఝుళిపించి.. జాతీయ భద్రతా చట్టాల కింద కేసులు నమోదు చేయడం ఏంటని ప్రియాంక గాంధీ ప్రశ్నించారు.