అసలు మీ దాంట్లో ప్రధాని ఎవరో ముందు నిర్ణయించుకోండి : ఉద్దవ్

విపక్షాలపై శివసేన అధినేత ఉద్దవ్ థాక్రే నిప్పులు చెరిగారు. అసలు ఇప్పటివరకు ప్రధాని అభ్యర్థిని నిర్ణయించలేని ప్రతిపక్షాలు.. ప్రజలకు మాత్రం హామీలు గుప్పిస్తున్నాయంటూ ఎద్దేవా చేశారు. దీనిపై ప్రశ్నించగా.. ముందు ఓటేయండి తరవాత చూద్దాం అని విపక్షాలు సమాధానమివ్వడం విడ్డూరంగా ఉందన్నారు. ముందు సమర్థుడైన నాయకుణ్ని వెతుక్కోవాలని వారికి ఉద్దవ్ సూచించారు. ప్రతిపక్ష కూటమిలోని ప్రతి ఒక్కరూ ప్రధాని పదవిపై ఆశతో ఉన్నారన్నారని.. కానీ ఇది కుర్చీలాట కాదన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని హితవు పలికారు.

Edited By:

Updated on: Apr 26, 2019 | 1:43 PM