
అవనిగడ్డ ప్రజలు బీజేపీకి షాకిచ్చారు. కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ పాల్గొన్న సభకు జనం కరువయ్యారు. ఈ సభ కోసం పార్టీ శ్రేణులు ఏర్పాట్లు చేసినా.. రాజ్‌నాథ్ ప్రసంగిస్తున్నప్పుడు సభలో చాలా వరకూ ఖాళీ కుర్చీలు దర్శనమిచ్చాయి. దీంతో రాష్ట్ర నేతలపై రాజ్‌నాథ్ తీవ్ర అసహనం వ్య క్తం చేశారు. అవనిగడ్డ సభ అనంతరం ఆయన విజయవాడ రావాల్సి ఉన్నా ఆ పర్యటనను రద్దు చేసుకున్నారు. కనీసం విలేకర్లతో మాట్లాడేందుకైనా విజయవాడ రావాలని నేతలు ఎంత బతిమాలినా ససేమిరా అన్నారు. షాక్ తిన్న బెజవాడ బీజేపీ నేతలు… రాజ్‌నాథ్ హెలికాప్టర్ పాడైందని, గంటన్నరకుపైగా ఆలస్యం అవుతుందని చెప్పి… విలేకర్లు తమంతట తాము వెళ్లిపోయేలా చేశారు.