
ఎంపీ ఎన్నికలపై నిజామాబాద్ రైతులు హైకోర్టును ఆశ్రయించారు. ఎన్నికలు వాయిదా వేయాలని వారు హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్‌ను దాఖలు చేశారు. బ్యాలెట్ ద్వారా ఎన్నికలు జరపాలని వారు తమ పిటిషన్‌లో పేర్కొన్నారు. దీనిపై మధ్యాహ్నం తరువాత విచారణను చేపట్టనుంది హైకోర్టు.
అయితే నిజామాబాద్ లోక్‌సభ స్థానానికి రికార్డు స్థాయిలో 185మంది అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేశారు. వీరిలో 170మందికి పైగా పసుపు, ఎర్రజొన్న రైతులే ఉన్నారు. ఎన్నికల తేది దగ్గరపడుతున్నా.. వీరిలో కొంతమందికి ఇంకా ఎన్నికల గుర్తును కేటాయించలేదు. దీనిపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఈ నియోజకవర్గంలో ఎన్నికల నిర్వహణ ఈసీకి తలనొప్పిగా మారిన విషయం తెలిసిందే.