కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేయడంలో బీజేడీదే కీలకపాత్ర: నవీన్‌ పట్నాయక్‌

భువనేశ్వర్‌ : సార్వత్రిక ఎన్నికల అనంతరం కేంద్ర ప్రభుత్వ ఏర్పాటులో బిజు జనతాదళ్‌(బీజేడీ) ప్రముఖ పాత్ర పోషిస్తుందని ఒడిసా సీఎం నవీన్‌ పట్నాయక్‌ అన్నారు. ఏ పార్టీకి కూడా తగిన మెజారిటీ రాదని, ప్రభుత్వ ఏర్పాటులో బీజేడీ, ఒడిసా ప్రజలే కీలకపాత్ర పోషిస్తారని ఆయన వెల్లడించారు. ఇదే తమకు దక్కబోయే అద్భుతమైన అవకాశమని అన్నారు. నయాగఢ్‌ నుంచి ఎన్నికల ప్రచారాన్ని మొదలు పెట్టిన ఆయన.. ఒడిషాలో ఉన్న 21 ఎంపీ సీట్లను తామే గెలుచుకుంటామని ధీమా వ్యక్తం […]

కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేయడంలో బీజేడీదే కీలకపాత్ర: నవీన్‌ పట్నాయక్‌

Edited By:

Updated on: Mar 25, 2019 | 7:41 PM

భువనేశ్వర్‌ : సార్వత్రిక ఎన్నికల అనంతరం కేంద్ర ప్రభుత్వ ఏర్పాటులో బిజు జనతాదళ్‌(బీజేడీ) ప్రముఖ పాత్ర పోషిస్తుందని ఒడిసా సీఎం నవీన్‌ పట్నాయక్‌ అన్నారు. ఏ పార్టీకి కూడా తగిన మెజారిటీ రాదని, ప్రభుత్వ ఏర్పాటులో బీజేడీ, ఒడిసా ప్రజలే కీలకపాత్ర పోషిస్తారని ఆయన వెల్లడించారు. ఇదే తమకు దక్కబోయే అద్భుతమైన అవకాశమని అన్నారు. నయాగఢ్‌ నుంచి ఎన్నికల ప్రచారాన్ని మొదలు పెట్టిన ఆయన.. ఒడిషాలో ఉన్న 21 ఎంపీ సీట్లను తామే గెలుచుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంపై ఎన్డీయే సర్కారు వివక్ష చూపిందని, హామీలు నెరవేర్చకుండా యువత, ప్రజలకు అన్యాయం చేసిందని ఆరోపించారు. 2014 ఎన్నికల్లో 20 సీట్లను బీజేడీ గెలుచుకోగా, ఒక సీటు బీజేపీకి దక్కింది.