Tirupati and Nagarjuna Sagar : తిరుపతి, నాగార్జుసాగర్‌ లో నేడే ఆఖరాట.. సాయంత్రం 5 తర్వాత ఎక్కడికక్కడ గప్ చుప్.!

|

Apr 15, 2021 | 7:04 AM

Nagarjuna Sagar and Tirupati By Election Campaign : తిరుపతి, నాగార్జుసాగర్‌ ఉపఎన్నికల ప్రచారం నేటితో ముగియనుంది..

Tirupati and Nagarjuna Sagar : తిరుపతి, నాగార్జుసాగర్‌ లో నేడే ఆఖరాట.. సాయంత్రం 5 తర్వాత ఎక్కడికక్కడ గప్ చుప్.!
Follow us on

Nagarjuna Sagar and Tirupati By Election Campaign : తిరుపతి, నాగార్జుసాగర్‌ ఉపఎన్నికల ప్రచారం నేటితో ముగియనుంది. తిరుపతి లోక్ సభ, నాగార్జున సాగర్ శాసనసభ ఉప ఎన్నికల ప్రచారానికి ఈ సాయంత్రం 5 గంటలతో గడువు ముగియనుంది. ఈ నెల 17న తిరుపతి పార్లమెంట్, సాగర్‌ అసెంబ్లీ స్థానానికి పోలింగ్‌ జరుగుతుంది. దీంతో ఇవాళ రెండు నియోజకవర్గాల్లో ఒక రాజకీయ యుద్ధ వాతావరణమే కనిపించబోతోంది. చివరి అస్త్రంగా ఆయా పార్టీలు రెండు చోట్లా సర్వశక్తులూ ఒడ్డుతూ ప్రచారం ఉదయం నుంచే నిర్వహించడం షురూ చేశాయి. ఇప్పటికే అల్టిమేట్ క్యాంపెయిన్ అన్నట్టు తెలంగాణ సీఎం, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సాగర్ లో సమరశంఖం పూరించేశారు. అటు, తిరుపతిలో మాత్రం సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి కరోనా నేపథ్యాన్ని చూపుతూ ప్రచారం, బహిరంగ సభను రద్దు చేసుకున్నప్పటికీ వైసీపీ మంత్రులు, నేతలు ఊపిరిసలపని ప్రచారం నిర్వహిస్తూ తమ పార్టీ అభ్యర్థి గెలుపుకోసం కృషి చేస్తున్నారు.

ఇక, తిరుపతి లోక్ సభ ఉపఎన్నికల బరిలో అధికారపార్టీ వైసీపీ నుంచి డాక్టర్ గురుమూర్తి, టీడీపీ నుంచి పనబాక లక్ష్మి, బీజేపీ-జనసేన ఉమ్మడి అభ్యర్థిగా మాజీ ఐఎఎస్ అధికారిని రత్నప్రభ, కాంగ్రెస్ పార్టీ నుంచి మాజీ ఎంపీ చింతామోహన్ బరిలో ఉన్నారు. అటు, సాగర్ ఉపఎన్నికలో అధికార టీఆర్ఎస్ పార్టీ నుంచి నోముల నర్శింహయ్య తనయుడు నోముల భగత్, కాంగ్రెస్ పార్టీ నుంచి సీనియర్ నేత జానారెడ్డి, బీజేపీ నుంచి రవినాయక్ తమతమ అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు.

Read also : Gold Smuggling : సూట్ కేస్ ఫ్రేమ్ లో బంగారం దాచుకొని దేశాలు దాటారు, చివరికి హైదరాబాద్ ఎయిర్ పోర్టులో..