నిమ్మగడ్డను విడువని వైసీపీ నేతలు.. అక్కడికి ఎస్‌ఈసీ వెల్లడం ఆశ్చర్యంగా ఉందన్న అంబటి

ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల సంఘం కమిషనర్‌ నిమ్మగడ్డ రమేశ్ కుమార్‌పై వైసీపీ నేతల విమర్శలు ఆగడం లేదు. తాజాగా నిమ్మగడ్డపై ఎమ్మెల్యే..

నిమ్మగడ్డను విడువని వైసీపీ నేతలు.. అక్కడికి ఎస్‌ఈసీ వెల్లడం ఆశ్చర్యంగా ఉందన్న అంబటి

Updated on: Feb 03, 2021 | 5:59 PM

ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల సంఘం కమిషనర్‌ నిమ్మగడ్డ రమేశ్ కుమార్‌పై వైసీపీ నేతల విమర్శలు ఆగడం లేదు. తాజాగా నిమ్మగడ్డపై ఎమ్మెల్యే అంబటి రాంబాబు ఫైర్‌ అయ్యారు. తూర్పుగోదావరి జిల్లాలో పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న ఒక అభ్యర్థి భర్త మరణిస్తే… అక్కడకు నిమ్మగడ్డ వెళ్లడం తనకు ఆశ్చర్యంగా ఉందని అన్నారు. నారా లోకేశ్ కు నిమ్మగడ్డ పైలట్ గా వెళ్లారా? అని ప్రశ్నించారు.

శ్రీకాకుళం జిల్లాలో అచ్చెన్నాయుడి బలవంతపు ఏకగ్రీవంపై నిమ్మగడ్డ ఎందుకు ప్రశ్నించడం లేదని అంబటి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎస్ఈసీ విడుదల చేసిన ఈ-యాప్ అంతా ఒక బూటకమని… టీడీపీ కార్యాలయంలో దాన్ని తయారు చేశారని ఆరోపించారు. నిమ్మగడ్డ రాసిన లేఖలు టీడీపీ కార్యాలయంలో తయారయ్యాయనే విషయం బయటపడిందని.. ఈ యాప్‌ కూడా అక్కడే తయారైందనే నిజం వెలుగులోకి వస్తుందని చెప్పారు.

చిన్న చిన్న సంఘటనలను పెద్ద రాద్దాంతం చేస్తున్నారని మండి పడ్డారు. పట్టాభిపై దాడి పేరుతో టీడీపీ కొత్త డ్రామాలు మొదలు పెట్టిందని అంబటి అన్నారు. చట్టానికి వ్యతిరేకంగా ఉంటే చంద్రబాబును సైతం అరెస్ట్ చేయాల్సిందేనని చెప్పారు. పట్టాభిపై దాడి జరిగిందని టీడీపీ హడావుడి చేస్తోందని… కానీ, పోలీసులకు దాడిపై ఫిర్యాదు మాత్రం చేయరని మండిపడ్డారు.

 

మరిన్ని ఇక్కడ చదవండి :

ఎస్‌ఈసీ ఈవాచ్ యాప్‌పై రగులతున్న వివాదం.. ముమ్మాటికి నిమ్మగడ్డ పర్సనల్‌ యాప్‌ అంటున్న వైసీపీ నేతలు

బాధ్యతలు స్వీకరించిన చిత్తూరు కొత్త కలెక్టర్‌.. ఆ విషయంలో కఠినంగా ఉంటానన్న హరినారాయణన్‌