గతంలో వారికి పట్టిన గతే వీరికీ పడుతుందన్న మంత్రి అవంతి.. ఇంతకీ ఏమిటా గతీ.. ఎవరికీ శాపనార్థాలు

|

Feb 10, 2021 | 11:52 AM

విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణపై వైసీపీ ప్రభుత్వం పోరాటానికి పదును పెంచుతుంది. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై మంత్రులు విమర్శల దాడి..

గతంలో వారికి పట్టిన గతే వీరికీ పడుతుందన్న మంత్రి అవంతి.. ఇంతకీ ఏమిటా గతీ.. ఎవరికీ శాపనార్థాలు
Follow us on

విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణపై వైసీపీ ప్రభుత్వం పోరాటానికి పదును పెంచుతుంది. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై మంత్రులు విమర్శల దాడి పెంచుతున్నారు. ప్రస్తుతం కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వానికంటే గతంలో శక్తి వంతమైన ఇందిరా గాంధీని సైతం ఎదుర్కొన్నాం. రాజకీయాల్లో ఉక్కు మహిళగా పేరొందిన ఇందిరాగాంధీని సైతం ఒప్పించి స్టీల్ ప్లాంట్ సాధించుకున్నాం. ఆమె ముందు ప్రస్తుతం ఉన్న మోదీ ప్రభుత్వం ఎంత అని మంత్రి అవంతి శ్రీనివాస్ అన్నారు.

ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటే ఇందిరమ్మను సైతం ప్రజలు గద్దె దించారని.. బీజేపీకి అదే గతి పడుతుందని హెచ్చరించారు. రాష్ట్ర విభజన జరిగిన దగ్గర నుండి ఏపీకి సమస్యలు తిష్ట వేశాయన్నారు. ప్రత్యేక హోదా లేదు, రైల్వేజోన్ లేదు, బడ్జెట్‌లో నిధులు లేవని మండిపడ్డారు. మళ్ళి స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంటూ కేంద్ర కొత్త నాటకం ఆడుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం దక్షణాది రాష్ట్రలను చిన్న చూపు చూస్తుందని విమర్శించారు. ఏపీ ప్రజల ఉసురు తగిలి వాళ్ళు ఎవ్వరూ బాగు పడలేదన్నారు.

పవన్ కళ్యాణ్, బీజేపీ నాయకులు తిరుపతిలో ఉప ఎన్నికల మీద కాకుండా రాష్ట్ర సమస్యల మీద దృష్టి పెట్టాలని మంత్రి హితవు పలికారు. ప్రైవేటీకరణ చేస్తామని 22 మంది ఎంపీలకు కేంద్రం ఒక్క మాట చెప్పలేదన్నారు. కొంత మంది రాజీనామాలు చేశారని.. దాని వల్ల ఫలితం ఉండదు పోరాటంతోనే ఫలితాలు ఉంటాయని చెప్పారు.

 

Read more:

కార్పోరేటర్ల భర్తలైతే ఏంటి.. మీకు ఇక్కడేం పని.. మున్సిపల్‌ కార్యాలయంలో ముచ్చెమటలు పట్టించిన ఆ ఏసీపీ