దీదీలో చాయ్ వాలా ! ఇది చిన్న సంతోషమే మరి !

|

Aug 22, 2019 | 11:52 AM

‘ఒక్కోసారి జీవితంలో మనం చేసే చిన్నపాటి సంతోషాలే.. చిన్న పనులే మనల్ని ఆనంద పరవశుల్ని చేస్తాయి..వీటిలో రుచికరమైన టీ తయారు చేయడం కూడా ఒకటి. దత్తాపూర్ లోని దిఘాలో నేనిదే చేశా ‘ అని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ పేర్కొన్నారు. బుధవారం తన రాజకీయ కార్యక్రమాలను ముగించుకుని… దిఘాలోని దత్తాపూర్ గ్రామంలో కొద్దిసేపు ఆగిన దీదీ.. అక్కడి ఓ టీ స్టాల్ లో ప్రవేశించారు. . ఆ స్టాల్ లో స్వయంగా టీ తయారు […]

దీదీలో చాయ్ వాలా ! ఇది చిన్న సంతోషమే మరి !
Follow us on

‘ఒక్కోసారి జీవితంలో మనం చేసే చిన్నపాటి సంతోషాలే.. చిన్న పనులే మనల్ని ఆనంద పరవశుల్ని చేస్తాయి..వీటిలో రుచికరమైన టీ తయారు చేయడం కూడా ఒకటి. దత్తాపూర్ లోని దిఘాలో నేనిదే చేశా ‘ అని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ పేర్కొన్నారు. బుధవారం తన రాజకీయ కార్యక్రమాలను ముగించుకుని… దిఘాలోని దత్తాపూర్ గ్రామంలో కొద్దిసేపు ఆగిన దీదీ.. అక్కడి ఓ టీ స్టాల్ లో ప్రవేశించారు. . ఆ స్టాల్ లో స్వయంగా టీ తయారు చేసి తన సహచరులకు అందజేశారు. ఈ వీడియోను ఆమె తన ట్విట్టర్లో షేర్ చేశారు. తేనీటి తయారీలో వ్ ఏమేం పదార్థాలు వాడుతారో ఆమె టీ స్టాల్ యజమానిని అడిగి తెలుసుకున్నారు. కిచెన్ లో వంట చేయడమంటే తనకెంతో సరదా అని, కానీ పొలిటికల్ ఎంగేజ్ మెంట్స్ కారణంగా తీరికలేక అది మిస్ అవుతున్నానని ఆమె అన్నారు. అదే చిన్నపాటి స్టాల్ లో ఓ చిన్నారిని ఎత్తుకుని ముద్దు చేసిన మమతా బెనర్జీ.. ఆ చిన్నారి తల్లికి కప్ కేక్ అందించారు. తమ స్టాల్ లో రాష్ట్ర ముఖ్యమంత్రి ఆగి స్వయంగా టీ తయారు చేయడాన్ని చూసి ఆ స్టాల్ యజమాని ఆనందంతో ఉబ్బితబ్బిబవుతున్నాడు. ఏనాడూ తాను ఊహించని ఈ ఘటన తాలూకు ఆశ్చర్యం నుంచి ఇప్పటికీ తేరుకోలేకపోతున్నాడు. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.