ఆంధ్రప్రదేశ్‌లో రేపే తొలిదశ పంచాయతీ పోలింగ్‌… ప్రచారంలో రూటు మార్చిన నందమూరి బాలకృష్ణ

|

Feb 08, 2021 | 5:14 PM

ఆంధ్రప్రదేశ్‌పంచాయతీ ఎన్నికల్లో భాగంగా మరికొన్ని గంటల్లో తొలిదశ ఓటింగ్ జరగబోతోంది. అందుకు సంబంధించి 12 జిల్లాల్లో అధికార యంత్రాంగం..

ఆంధ్రప్రదేశ్‌లో రేపే తొలిదశ పంచాయతీ పోలింగ్‌... ప్రచారంలో రూటు మార్చిన నందమూరి బాలకృష్ణ
Follow us on

ఆంధ్రప్రదేశ్‌పంచాయతీ ఎన్నికల్లో భాగంగా మరికొన్ని గంటల్లో తొలిదశ ఓటింగ్ జరగబోతోంది. అందుకు సంబంధించి 12 జిల్లాల్లో అధికార యంత్రాంగం సర్వం సిద్ధం చేసింది. 3 వేల 249 పంచాయతీలకు ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే 525 స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి. 12 జిల్లాల్లో 29 వేల 732 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. జోనల్ అధికారులు, మైక్రో అబ్జర్వర్లు సిద్ధంగా ఉన్నారు. పోలింగ్ ముగిసిన తర్వాత ఓట్లు లెక్కిస్తారు. వెంటనే ఫలితాలు ప్రకటిస్తారు.

ఎన్నికలకు అభ్యర్థుల ప్రచారం ఇప్పటికే ముగిసింది. పార్టీలతో సంబంధం లేకపోయినా పార్టీలకు అనుబంధంగా వ్యక్తులు వార్డుమెంబర్లకు, సర్పంచ్‌గిరీకీ పోటీ చేస్తున్నారు. పోటీ గ్రామస్థాయిలోనే అయినా ప్రచారం, గెలుపోటముల బాధ్యత రాష్ట్రస్థాయి నాయకత్వం తీసుకుంటోంది. టీడీపీ తరఫున బాలకృష్ణ చేసిన ఫోన్ ప్రచారం ఎన్నికలు ఏ రేంజ్‌లో ఉన్నాయో అర్థమవుతుంది.

నెల్లూరు జిల్లా రుద్రకోటలో టీడీపీ నేత కోటం శ్రీనివాసుల రెడ్డితో జిల్లాలోని పంచాయతీ ఎన్నికలపై ప్రచారం నిర్వహించారు బాలయ్య. పనిలో పనిగా.. జగన్ ప్రభుత్వంపై విమర్శలూ చేశారు. రాష్ట్రంలో రాక్షసపాలన సాగుతోందని, మన దురదృష్టమని వాపోయారు. ఉత్తర భారతదేశ రాష్ట్రాలలో ఇలాంటి పాలన చూశామన్నారు. కార్యకర్తలు, అభిమానులతో తనది జన్మజన్మల అనుబంధమని, ఎవరికి ఇబ్బంది వచ్చినా సహించనన్నారు. సినిమా షూటింగ్ పూర్తయ్యాక రోడ్లమీదకి వస్తానని, ప్రజలందర్నీ కలుసుకుంటానన్నారు.

 

Read more:

ఆ వర్గాలకు రిజర్వేషన్లు కల్పిస్తూ అధికారిక ఉత్తర్వులు జారీ.. తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం