అద్వానీ వ్యాఖ్యలను స్వాగతిస్తున్నాం

| Edited By: Pardhasaradhi Peri

Apr 08, 2019 | 8:14 PM

భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాలు, జాతీయవాదం గురించి ఆ పార్టీ వ్యవస్థాపక సభ్యులలో ఒకరైన ఎల్‌కే అద్వానీ చేసిన వ్యాఖ్యలు రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. రాజకీయంగా వ్యతిరేకించే వారిని బీజేపీ ప్రత్యర్థులుగా చూసిందే తప్ప.. దేశ ద్రోహులుగానో, శత్రువులుగానో పరిగణించలేదని అద్వానీ తన బ్లాగ్‌లో రాసుకొచ్చారు. దీంతో ఆయన వ్యాఖ్యలకు ప్రతిపక్షాలు మద్దతు పలుకుతున్నాయి. అలాంటి గొప్ప నేతను సొంత పార్టీనే మర్చిపోవడం బాధాకరమంటూ మోదీ, అమిత్‌ షాలపై విమర్శలు పెరుగుతున్నాయి. ‘‘ఓ సీనియర్ రాజకీయ నాయకుడిగా, […]

అద్వానీ వ్యాఖ్యలను స్వాగతిస్తున్నాం
Follow us on

భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాలు, జాతీయవాదం గురించి ఆ పార్టీ వ్యవస్థాపక సభ్యులలో ఒకరైన ఎల్‌కే అద్వానీ చేసిన వ్యాఖ్యలు రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. రాజకీయంగా వ్యతిరేకించే వారిని బీజేపీ ప్రత్యర్థులుగా చూసిందే తప్ప.. దేశ ద్రోహులుగానో, శత్రువులుగానో పరిగణించలేదని అద్వానీ తన బ్లాగ్‌లో రాసుకొచ్చారు. దీంతో ఆయన వ్యాఖ్యలకు ప్రతిపక్షాలు మద్దతు పలుకుతున్నాయి. అలాంటి గొప్ప నేతను సొంత పార్టీనే మర్చిపోవడం బాధాకరమంటూ మోదీ, అమిత్‌ షాలపై విమర్శలు పెరుగుతున్నాయి.

‘‘ఓ సీనియర్ రాజకీయ నాయకుడిగా, మాజీ ఉపప్రధానిగా, బీజేపీ వ్యవస్థాపక సభ్యుడిగా ప్రజాస్వామ్యంలో పార్టీల మధ్య ఉండే మర్యాదలపై అద్వానీ చేసిన వ్యాఖ్యలకు చాలా ప్రాముఖ్యత ఉంది. ఆయన అన్నట్లుగా ఓ పార్టీకి వ్యతిరేకంగా గళమెత్తేవారందరూ దేశద్రోహులు కారు. అద్వానీ వ్యాఖ్యాలను మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నాం’’ అంటూ పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ ట్వీట్ చేశారు.

‘‘ప్రతిపక్షాలన్నింటిని దేశ ద్రోహులుగా పరిగణిస్తున్న బీజేపీ గురించి ఆ పార్టీ సీనియర్ నేత ఇప్పుడు మాట్లాడటం వింతగా ఉంది. 2014 నుంచి ఆయన ఒక్క మాట కూడా మాట్లాడలేదు. కేంద్రంలో బీజేపీ అధికారం అయిపోయే సమయంలో ఆయన మాట్లాడారు. ఇన్ని సంవత్సరాలు ఆయన మాట్లాడి ఉంటే బావుండేది’’ అంటూ ముఫ్తీ ట్వీట్ చేశారు.

‘‘రాజకీయంగా వ్యతిరేకించే వారిని ప్రత్యర్థులుగా చూశామే గానీ.. శత్రువులుగానో, దేశ ద్రోహులుగానో చూడలేదని అద్వానీ తెలిపారు. కానీ మోదీజీ నేతృత్వంలో బీజేపీ సిద్ధాంతాలు మారిపోయాయి’’ అంటూ కాంగ్రెస్ సీనియర్ నేత కపిల్ సిబాల్ అన్నారు.