‘మోదీ’ బయోపిక్‌‌పై ఈసీకి ఫిర్యాదు చేసిన‌ వామపక్షాలు

| Edited By:

Mar 26, 2019 | 7:06 PM

దేశంలో సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ ప్రధాని మోదీ జీవితం ఆధారంగా తెరకెక్కిన ‘పీఎం నరేంద్ర మోదీ’ సినిమా రాజకీయ వేడిని రాజేస్తోంది. ఈ చిత్రం విడుదలను వాయిదా వేయాలని సీపీఐ, సీపీఎం ప్రతినిధుల బృందం ఎన్నికల సంఘానికి విజ్ఞప్తి చేసింది. ప్రధాని నరేంద్ర మోదీ జీవిత విశేషాలతో కూడిన ఈ చిత్రాన్ని ఎన్నికల ముందు విడుదల చేయడమంటే అది ఓటర్లను ప్రభావితం చేయడమే అవుతుందని వామపక్ష నేతలు ఈసీ అధికారుల దృష్టికి తెచ్చారు. సీపీఐ నేత […]

మోదీ బయోపిక్‌‌పై ఈసీకి ఫిర్యాదు చేసిన‌ వామపక్షాలు
Follow us on

దేశంలో సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ ప్రధాని మోదీ జీవితం ఆధారంగా తెరకెక్కిన ‘పీఎం నరేంద్ర మోదీ’ సినిమా రాజకీయ వేడిని రాజేస్తోంది. ఈ చిత్రం విడుదలను వాయిదా వేయాలని సీపీఐ, సీపీఎం ప్రతినిధుల బృందం ఎన్నికల సంఘానికి విజ్ఞప్తి చేసింది. ప్రధాని నరేంద్ర మోదీ జీవిత విశేషాలతో కూడిన ఈ చిత్రాన్ని ఎన్నికల ముందు విడుదల చేయడమంటే అది ఓటర్లను ప్రభావితం చేయడమే అవుతుందని వామపక్ష నేతలు ఈసీ అధికారుల దృష్టికి తెచ్చారు. సీపీఐ నేత డి.రాజా, సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యుడు నీలోత్పల్ బసు ఎన్నికల అధికారులను కలుసుకున్న వారిలో ఉన్నారు.

పారదర్శకంగా ఎన్నికలు జరిగేందుకు వీలుగా ఈ చిత్రం విడుదలపై మే 23 వరకూ నిషేధం విధించాలని సీపీఐ, సీపీఎం పార్టీలు ఈసీని డిమాండ్‌ చేశాయి. ఎన్నికల ముందు సినిమా విడుదల చేయడం వల్ల త్రిపుర, పశ్చిమబెంగాల్‌లో తీవ్రమైన శాంతి భద్రతల సమస్య తలెత్తే అవకాశాలున్నాయని ఈసీకి విన్నవించారు. కాగా…నరేంద్ర మోదీ బయోపిక్ విడుదల విషయాన్ని తమ ప్రతినిధి బృందం ఈసీ అధికారులతో కూలంకషంగా చర్చించిందని, ఎన్నికల సమయాల్లో ఇలాంటి ప్రచారాన్ని నిలిపివేసిన సందర్భాలు గతంలోనూ ఉన్న విషయాన్ని ఈసీ దృష్టికి తెచ్చామని ప్రతినిధి బృందం మంగళవారంనాడు ఒక ప్రకటనలో తెలిపింది. అయితే ఈసీ తమకు ఎలాంటి భరోసా ఇవ్వలేదని కూడా ఆ ప్రకటన పేర్కొంది. వివేక్ ఒబెరాయ్ కీలక పాత్ర పోషించిన ‘పీఎం నరేంద్ర మోదీ’ చిత్రం షెడ్యూల్ ప్రకారం ఏప్రిల్ 5న విడుదల కావాల్సి ఉంది. లోక్‌సభ ఎన్నికల తేదీల ప్రకారం తొలి విడత పోలింగ్ ఏప్రిల్ 11న ప్రారంభమవుతోంది.