Komatireddy: వచ్చేవారు వస్తారు… పోయేవారు పోతారు..! తమ్ముడి పార్టీ మార్పుపై అన్న కామెంట్..!

కాంగ్రెస్‌లోకి వచ్చేవారు వస్తారు... పోయేవారు పోతారు.. కాంగ్రెస్‌కి చావు లేదన్నారు ఎంపీ కోమిటిరెడ్డి వెంకట్‌రెడ్డి  వారం, పది రోజుల్లో పీసీసీ చీఫ్ నియామకం జరుగుతుందన్నారు.

Komatireddy: వచ్చేవారు వస్తారు... పోయేవారు పోతారు..! తమ్ముడి పార్టీ మార్పుపై అన్న కామెంట్..!
MP Komatireddy Venkat Reddy (File Photo)

Updated on: Jun 07, 2021 | 7:33 PM

కాంగ్రెస్‌లోకి వచ్చేవారు వస్తారు… పోయేవారు పోతారు.. కాంగ్రెస్‌కి చావు లేదన్నారు ఎంపీ కోమిటిరెడ్డి వెంకట్‌రెడ్డి  వారం, పది రోజుల్లో పీసీసీ చీఫ్ నియామకం జరుగుతుందన్నారు. పీసీసీ చీఫ్ పదవి తప్పితే… ఏ పదవి తీసుకోనని కరాకండిగా తేల్చి చెప్పారు. పీసీసీ పదవి ముఖ్య మంత్రి పదవి కాదన్నారు. పీసీసీ పదవి ఇస్తే తెలంగాణ వ్యాప్తంగా తిరిగి పార్టీని బలోపేతం చేస్తానని ధీమా వ్యక్తం చేశారు. లేదంటే ఉమ్మడి నల్గొండలో మెజారిటీ సీట్లు గెలిపించే బాధ్యత తీసుకుంటా అని అన్నారు. తనకు పదవులు ముఖ్యం కాదన్నారు.

రాజగోపాల్ రెడ్డితో పార్టీ మార్పు పై తాను ఎప్పుడు మాట్లాడ లేదన్నారు కోమటి రెడ్డి వెంకటరెడ్డి. అన్న ఓ పార్టీ… తమ్ముడు ఇంకో పార్టీలో ఉంటే తప్పు ఎంటి అని ప్రశ్నించారు. మాది ఉమ్మడి కుటుంబం… మా మధ్య రాజకీయాలు చర్చకు రావని వివరణ ఇచ్చారు. రేవంత్ ఒక్కడే కాదు.. వీహెచ్.. జగ్గారెడ్డిలు కూడా పీసీసీ అడుగుతున్నారని… కానీ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా తనకే మద్దతు ఇస్తున్నారని ఎంపీ కోమిటిరెడ్డి వెంకట్‌రెడ్డి పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి: Detox Drink: ప్రతి ఉదయం డిటాక్స్ డ్రింక్ తాగండి.. మీ రోగనిరోధక శక్తిని పెంచుకోండి..

సర్వేపల్లితోనే ఆనందయ్య మందు ఆగిపోదు.. త్వరలోనే ఇతర జిల్లాలకూ పంపిణీ చేస్తాం – ఎమ్మెల్యే కాకాణి

Loading...
Unable to load recommendations.
Follow Us