ఏపీలో ట్విట్టర్ వేదికగా రాజకీయనాయకుల మధ్య ట్వీట్ల తూటాలు పేలుతున్నాయి. ఏపీ సీఎం జగన్‌పై టీడీపీ ఎంపీ కేశినేని నాని ట్విట్టర్‌లో ఫైర్ అయ్యారు. ఏపీ సర్కార్ ఉద్యోగాల్లో 75శాతం స్థానికులకు అవకాశం కల్పిస్తూ తీసుకొచ్చిన కొత్త చట్టంపై విమర్శలు గుప్పించారు. జగన్ చేతిలో అధికారం పిచ్చోడి చేతిలో రాయిలా ఉందంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇలాంటి చట్టమే రేపటి రోజున ఇతర రాష్ట్రాల్లో కూడా చేస్తే… హైదరాబాద్, బెంగుళూరు, చెన్నై, ముంబై, పూణె, ఢిల్లీ లాంటి చోట్లలో ఏపీ వారికి ఉద్యోగాలు వస్తాయా అంటూ ప్రశ్నించారు. అమ్మ పెట్టలేదు.. అడుక్కు తిననివ్వదు అన్నట్లు పరిస్థితి ఉందని ఘాటుగా వ్యాఖ్యానించారు.
జగన్ రెడ్డి గారు @ysjagan పిచ్చి వాడి చేతిలో రాయి లాగా వుంది మీ చేతిలో అధికారం.
మీరు చేసిన చట్టమే రేపు ఇతర రాష్ట్రాలు చేస్తే హైదరాబాద్, బెంగుళూరు, చెన్నై, ముంబై, పూణె ఢిల్లీ లాంటి చోట్లలో మన వారికి ఉద్యోగాలు వస్తాయా?
అమ్మ పెట్టలేదు అడుక్కు తిననివదు అన్నట్లుంది పరిస్థితి pic.twitter.com/yrF2oP2jJX— Kesineni Nani (@kesineni_nani) July 24, 2019