
తెలంగాణాలో నామినేషన్ల పర్వం ఊపందుకుంది. నామినేషన్లకు ఇంకా మూడు రోజులే ఉండటంతో భారీగా నామినేషన్లు దాఖలవుతున్నాయి. నిజామాబాద్‌లో ఇవాళ తన నామినేషన్ దాఖలు చేస్తారు ఎంపీ కవిత. మధ్యాహ్నం 2 గంటలకు తన నామినేషన్ పత్రాలు కవిత సమర్పిస్తారు. సాయంత్రం 6 గంటల 30 నిమిషాలకు మక్లూరు మండలం మాణిక్ భండార్‌లో జరిగే రోడ్‌షోలో షాల్గొంటారు కవిత. కాగా.. నిన్న టీఆర్ఎస్ అభ్యర్థులను ప్రకటించారు సీఎం కేసీఆర్. ఎంపిక చేసిన అభ్యర్థులకు బీఫారాలను అందించారు. దీంతో ఇవాళ కవితతో పాటు మరికొంతమంది టీఆర్ఎస్ అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేయనున్నారు.