నా కష్టాలు నీకేం తెలుసు జగన్‌?: పవన్ కళ్యాణ్

రాజమండ్రి: రాజమహేంద్రవరం నిర్వహించిన ‘జనసేన ఐదో ఆవిర్భావ సభలో పవన్ కళ్యాణ్ మాట్లాడారు. 2014లో ఏం ఆశించకుండా తెదేపా, భాజపాకు మద్దతు ఇచ్చానని చెప్పారు. తనను ఎన్నిరకాలుగా తిట్టినా, భయపెట్టినా చలించలేదని, మార్పు కోసం జరుగుతున్న ప్రయత్నంలో తనది మంత్రసాని పాత్ర అని పవన్ అన్నారు. వైకాపా పాలసీలను విమర్శిస్తుంటే జగన్‌ తనను వ్యక్తిగతంగా విమర్శిస్తున్నారని పవన్‌ ఆరోపించారు. తాను రూ.వేల కోట్లు ఆస్తులు దోచానా? కులాల పేరిట మనుషుల్ని వేరు చేశామా? కుటుంబ పాలన చేశామా? […]

నా కష్టాలు నీకేం తెలుసు జగన్‌?: పవన్ కళ్యాణ్

Updated on: Mar 14, 2019 | 7:02 PM

రాజమండ్రి: రాజమహేంద్రవరం నిర్వహించిన ‘జనసేన ఐదో ఆవిర్భావ సభలో పవన్ కళ్యాణ్ మాట్లాడారు. 2014లో ఏం ఆశించకుండా తెదేపా, భాజపాకు మద్దతు ఇచ్చానని చెప్పారు. తనను ఎన్నిరకాలుగా తిట్టినా, భయపెట్టినా చలించలేదని, మార్పు కోసం జరుగుతున్న ప్రయత్నంలో తనది మంత్రసాని పాత్ర అని పవన్ అన్నారు.

వైకాపా పాలసీలను విమర్శిస్తుంటే జగన్‌ తనను వ్యక్తిగతంగా విమర్శిస్తున్నారని పవన్‌ ఆరోపించారు. తాను రూ.వేల కోట్లు ఆస్తులు దోచానా? కులాల పేరిట మనుషుల్ని వేరు చేశామా? కుటుంబ పాలన చేశామా? ఏం చేశాను. నా కష్టాలు నీకేం తెలుసు జగన్‌? అంటూ పవన్ మండిపడ్డారు.