నాదెండ్ల గెలుపు ఖాయం – హైపర్ ఆది

|

Mar 23, 2019 | 8:26 PM

గుంటూరు జిల్లా తెనాలిలో జనసేన అభ్యర్థిగా పోటీ చేస్తున్న నాదెండ్ల మనోహర్ గెలుపు ఖాయమని కమెడియన్ హైపర్ ఆది జోస్యం చెప్పారు. ఆయన జనసేన తరపున ఎన్నికల ప్రచారం చేస్తున్న సంగతి తెలిసిందే. కొల్లిపొరలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆది ఈ వ్యాఖ్యలు చేశారు. తెనాలిని అభివృద్ధి చేసిన ఘనత మనోహర్‌దేనన్నారు. అంతేకాదు జనసేన కు ఓటు వేయాలని.. పవన్ కళ్యాణ్ ను సీఎం చేయాలనీ పిలుపునిచ్చారు. కాగా నాదెండ్ల మనోహర్ కాంగ్రెస్ ను వీడి జనసేనలో […]

నాదెండ్ల గెలుపు ఖాయం - హైపర్ ఆది
Follow us on

గుంటూరు జిల్లా తెనాలిలో జనసేన అభ్యర్థిగా పోటీ చేస్తున్న నాదెండ్ల మనోహర్ గెలుపు ఖాయమని కమెడియన్ హైపర్ ఆది జోస్యం చెప్పారు. ఆయన జనసేన తరపున ఎన్నికల ప్రచారం చేస్తున్న సంగతి తెలిసిందే. కొల్లిపొరలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆది ఈ వ్యాఖ్యలు చేశారు. తెనాలిని అభివృద్ధి చేసిన ఘనత మనోహర్‌దేనన్నారు. అంతేకాదు జనసేన కు ఓటు వేయాలని.. పవన్ కళ్యాణ్ ను సీఎం చేయాలనీ పిలుపునిచ్చారు.

కాగా నాదెండ్ల మనోహర్ కాంగ్రెస్ ను వీడి జనసేనలో చేరిన సంగతి తెలిసిందే. ఇక గతంలో మనోహర్ ఇక్కడ నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు. ఆయన ఉమ్మడి ఏపీ శాసనసభకు స్పీకర్‌గా కూడా పనిచేశారు.