వంద కోట్లు దాటిన డ్రీమ్ గర్ల్ ఆస్తులు

మథుర పార్లమెంటరీ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా అలనాటి బాలీవుడ్ హీరోయిన్, సిట్టింగ్ ఎంపీ హేమమాలిని పోటీ చేస్తున్నారు. దీనికి సంబంధించిన నామినేషన్‌ను ఆమె దాఖలు చేయగా.. అందులో ఆస్తుల వివరాలను ప్రకటించారు. తనతో పాటు భర్త ధర్మేంద్ర ఆస్తులను కూడా ఆమె ఎన్నికల కమిషన్‌ను సమర్పించారు. విలువైన బంగళాలు, ఆభరణాలు, నగదు, షేర్లు, టర్మ్ డిపాజిట్లు అన్నీ కలిపి తమ ప్రస్తుత ఆస్తుల విలువ రూ.101కోట్లుగా హేమమాలిని అఫిడవిట్‌లో వెల్లడించారు. కాగా 2014 ఎన్నికలకు ముందు […]

వంద కోట్లు దాటిన డ్రీమ్ గర్ల్ ఆస్తులు

Updated on: Mar 27, 2019 | 6:20 PM

మథుర పార్లమెంటరీ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా అలనాటి బాలీవుడ్ హీరోయిన్, సిట్టింగ్ ఎంపీ హేమమాలిని పోటీ చేస్తున్నారు. దీనికి సంబంధించిన నామినేషన్‌ను ఆమె దాఖలు చేయగా.. అందులో ఆస్తుల వివరాలను ప్రకటించారు. తనతో పాటు భర్త ధర్మేంద్ర ఆస్తులను కూడా ఆమె ఎన్నికల కమిషన్‌ను సమర్పించారు. విలువైన బంగళాలు, ఆభరణాలు, నగదు, షేర్లు, టర్మ్ డిపాజిట్లు అన్నీ కలిపి తమ ప్రస్తుత ఆస్తుల విలువ రూ.101కోట్లుగా హేమమాలిని అఫిడవిట్‌లో వెల్లడించారు.

కాగా 2014 ఎన్నికలకు ముందు ఆమె రూ.66కోట్ల విలువైన ఆస్తులను కలిగి ఉన్నారు. ఈ ఐదేళ్లలో ఆమె సంపద 34.46కోట్ల మేర పెరిగింది. అలాగే భర్త ధర్మేంద్ర ఆస్తులు 12.30కోట్లకు పెరిగాయి. ఇదిలా ఉంటే మథుర నియోజకవర్గం కోసం చాలా చేశానని చెప్పిన హేమమాలిని ఈ ఎన్నికల్లో కూడా విజయం సాధిస్తానని ధీమా వ్యక్తం చేశారు. అలాగే ఇవే తన చివరి ఎన్నికలు అని, 2024 ఎన్నికల్లో పోటీ చేయనని ఈ సందర్భంగా హేమ మాలిని వెల్లడించారు.

Loading...
Unable to load recommendations.
Follow Us