అంతా మీరే చేశారు బాబు గారూ..

| Edited By:

Aug 14, 2019 | 9:42 PM

అంతా మీరే చేశారు…అంతా మీరే చేశారు. ఇదీ సినిమా డైలాగ్ కాదు…ఏపీ ఎన్నికల్లో ఘోర ఓటమిపై తెలుగు తమ్ముళ్ల డైలాగ్ ఇది. జగన్ ఫ్యాన్ గాలికి ఉక్కిరిబిక్కిరైన టీడీపీ నేతలంతా ఇప్పుడిప్పుడే కాస్త కోలుకుంటున్నట్లు కనిపిస్తున్నారు. పార్టీ అధినేత బాబు కూడా సమీక్షల పేరుతో అసలేం జరిగిందో తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇదే సందు అనుకుని ఇన్నాళ్లు లోలోపల బాధపడిన నేతలంతా నిర్మోహమాటంగా అంతా మీరే చేశారంటూ బాబు ముఖం మీదే గోరంట్ల, అయ్యన్నపాత్రుడు కుండబద్దలు కొట్టారట. […]

అంతా మీరే చేశారు బాబు గారూ..
Follow us on

అంతా మీరే చేశారు…అంతా మీరే చేశారు. ఇదీ సినిమా డైలాగ్ కాదు…ఏపీ ఎన్నికల్లో ఘోర ఓటమిపై తెలుగు తమ్ముళ్ల డైలాగ్ ఇది. జగన్ ఫ్యాన్ గాలికి ఉక్కిరిబిక్కిరైన టీడీపీ నేతలంతా ఇప్పుడిప్పుడే కాస్త కోలుకుంటున్నట్లు కనిపిస్తున్నారు. పార్టీ అధినేత బాబు కూడా సమీక్షల పేరుతో అసలేం జరిగిందో తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇదే సందు అనుకుని ఇన్నాళ్లు లోలోపల బాధపడిన నేతలంతా నిర్మోహమాటంగా అంతా మీరే చేశారంటూ బాబు ముఖం మీదే గోరంట్ల, అయ్యన్నపాత్రుడు కుండబద్దలు కొట్టారట.

గోరంట్ల బుచ్చయ్య చౌదరి అయితే ఒక రేంజ్‌లో అసంతృప్తిని వ్యక్తం చేశారట. కొత్తవాళ్లకి అవకాశం ఇవ్వాలి. సీనియర్లు సలహాలకు, వ్యూహరచనకి పరిమితమైతే చాలని తేల్చి చెప్పేశారట. అదే సమయంలో అధికారంలో ఉన్నవేళ పార్టీలో నడిచిన తప్పిదాలను బుచ్చయ్య చౌదరి నిర్మొహమాటంగా ప్రస్తావించారట. ఇంకో అడుగు ముందుకేసి ఎందుకూ పనికి రాని వాళ్లు వచ్చి పార్టీ మీటింగ్స్‌లో కూర్చుంటున్నారంటూ ఘాటుగా అన్నారట. అలానే వైట్‌ ఎలిఫేంట్స్‌ని పక్కన పెడితే తప్ప…పరిస్థితిలో మార్పు రాదని స్పష్టం చేశారట. నాలుగైదు సార్లు ఓడిన వాళ్లని తీసుకొచ్చి కేబినెట్‌లో కూర్చోపెట్టడం వల్ల కూడా చాలా నష్టం జరిగిందన్నరట.

వైసీపీని టార్గెట్‌ చేస్తూ…విమర్శలతో, ఆరోపణలతో సమావేశం సాగుతుందని క్యాడర్‌ అంతా భావించిందట. కానీ….మనలోని లోపాలను సరిదిద్దుకోవాల్సిందే అని గోరంట్ల బుచ్చయ్య చౌదరి గట్టిగా చెప్పడంతో తెలుగుతమ్ముళ్లు మెచ్చుకుంటున్నారట. కనీసం మీరన్నా నోరు విప్పారని అభినందిస్తున్నారట. అదే సమయంలో వైట్‌ ఎలిఫెంట్స్‌ని పక్కన పెట్టాల్సందే అన్న గోరంట్ల కామెంట్‌ చుట్టూ పార్టీలోనే గుసగుసలు సాగుతున్నాయట. ఎవరా వైట్‌ ఎలిఫెంట్స్‌ అంటూ రకరకాల పేర్ల చుట్టూ డిస్కషన్‌ నడుస్తోందట.

ఇక మరో సీనియర్‌ నేత అయ్యన్నపాత్రుడు కూడా తనదైనశైలిలో తప్పులను ఎత్తి చూపించారట. అధికారంలో ఉన్న వేళ జరగుతోన్న తప్పులను అధిష్టానం దృష్టికి తీసుకొచ్చినా పట్టించుకోలేదని ఓపెన్‌గా చెప్పేశారట. అప్పుడే వాటిని సరిచేసి జాగ్రత్త పడితే బావుండేందని…ఇప్పటికైనా అలాంటి పొరపాట్లకు అవకాశం ఇవ్వవద్దని తేల్చేశారట.