ఉన్నత విద్యావంతురాలైన నూతన మేయర్‌.. తండ్రి రాజకీయ వారసత్వం కోసం విజయలక్ష్మి ఏం చేసిందో తెలుసా..?

గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ నూతన మేయర్‌గా టీఆర్‌ఎస్‌ అభ్యర్థి, సీనియర్‌ నేత, ఎంపీ కే.కేశవరావు కుమార్తె గద్వాల విజయలక్ష్మి..

ఉన్నత విద్యావంతురాలైన నూతన మేయర్‌.. తండ్రి రాజకీయ వారసత్వం కోసం విజయలక్ష్మి ఏం చేసిందో తెలుసా..?

Updated on: Feb 11, 2021 | 4:12 PM

గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ నూతన మేయర్‌గా టీఆర్‌ఎస్‌ అభ్యర్థి, సీనియర్‌ నేత, ఎంపీ కే.కేశవరావు కుమార్తె గద్వాల విజయలక్ష్మి ఎన్నికయ్యారు. మేయర్ పీఠంపై అనేక మంది పోటీ పడ్డప్పటికీ టీఆర్ఎస్ అధిష్టానం విజయలక్ష్మి వైపై మొగ్గు చూపింది. విజయలక్ష్మి.. బంజారాహిల్స్ డివిజన్ 93 కార్పొరేటర్‌గా రెండు సార్లు ఎన్నికయ్యారు.

ఎంపీ కే.కేశవరావు కుమార్తె అయిన విజయలక్ష్మి బాల్యం నుంచి విద్యాభ్యాసం అంతా హైదరాబాద్‌లోనే సాగింది. హోలీ మేరీ స్కూల్‌లో పాఠశాల విద్య, రెడ్డి మహిళా కాలేజీ గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేశారు. భారతీయ విద్యాభవన్‌లో జర్నలిజం, సుల్తానా ఉల్ లూమ్ లా కాలేజీలో ఎల్ఎల్‌బీ పూర్తి చేశారు. బాబీ రెడ్డితో వివాహం తర్వాత అమెరికా వెళ్లారు. దాదాపు 18 ఏళ్లపాటు అమెరికాలోనే ఉన్నారు.

తండ్రి ఆదేశం మేరకు 2007లో భారత్ తిరిగొచ్చిన విజయలక్ష్మి.. రాజకీయాల్లో తండ్రి వారసత్వాన్ని కొనసాగిస్తున్నారు. ఇందుకోసం అమెరికా పౌరసత్వాన్ని వదిలేసుకున్నారు. 2016లో బంజారాహిల్స్‌ కార్పొరేటర్‌గా తొలిసారి భారీ మెజార్టీతో విజయం సాధించారు. ఇక ఇటీవల జరిగిన మున్సిపల్‌ ఎన్నికల్లో మరోసారి విజయం సాధించి, మేయర్‌ పదవిని చేజిక్కించుకున్నారు.

 

Read more:

రెండు తెలుగు రాష్ట్రాల్లో మోగిన మరో ఎన్నికల నగారా.. షెడ్యూల్‌ విడుదల చేసిన కేంద్ర ఎన్నికల సంఘం