పవన్‍కు ‘గబ్బర్‌సింగ్ బ్యాచ్’ మద్దతు

పవన్‌కళ్యాణ్ ‘గబ్బర్‌సింగ్’ సినిమాలోని అంత్యాక్షరి సీన్ గురించి అందరికీ తెలుసు. ఆ సీన్‌లో నటించిన జూనియర్ ఆర్టిస్ట్‌లంతా గబ్బర్‌సింగ్ బ్యాచ్‌గా స్థిరపడిపోయారు. పవన్ సినిమాలో వచ్చిన ఆ ఛాన్స్ తమ జీవితాన్ని మార్చేసిందని ఆ బ్యాచ్ గర్వంగా చెప్పుకుంటారు. ఏపీలో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల్లో పవన్ రుణం తీర్చుకునే అవకాశం వచ్చిందని భావించిన గబ్బర్‌సింగ్ బ్యాచ్ మంగళవారం అమరావతికి వచ్చేశారు. జనసేన కార్యాలయంలో పవన్‌కళ్యాణ్‌ను కలిసి తమ మద్దతు ప్రకటించారు. పార్టీ తరపున ప్రచారంలో పాల్గొంటామని, వచ్చే […]

పవన్‍కు ‘గబ్బర్‌సింగ్ బ్యాచ్’ మద్దతు

Edited By:

Updated on: Mar 26, 2019 | 4:03 PM

పవన్‌కళ్యాణ్ ‘గబ్బర్‌సింగ్’ సినిమాలోని అంత్యాక్షరి సీన్ గురించి అందరికీ తెలుసు. ఆ సీన్‌లో నటించిన జూనియర్ ఆర్టిస్ట్‌లంతా గబ్బర్‌సింగ్ బ్యాచ్‌గా స్థిరపడిపోయారు. పవన్ సినిమాలో వచ్చిన ఆ ఛాన్స్ తమ జీవితాన్ని మార్చేసిందని ఆ బ్యాచ్ గర్వంగా చెప్పుకుంటారు.

ఏపీలో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల్లో పవన్ రుణం తీర్చుకునే అవకాశం వచ్చిందని భావించిన గబ్బర్‌సింగ్ బ్యాచ్ మంగళవారం అమరావతికి వచ్చేశారు. జనసేన కార్యాలయంలో పవన్‌కళ్యాణ్‌ను కలిసి తమ మద్దతు ప్రకటించారు. పార్టీ తరపున ప్రచారంలో పాల్గొంటామని, వచ్చే ఎన్నికల్లో జనసేన పార్టీ ఘన విజయం సాధించడం ఖాయమని వారు ధీమా వ్యక్తం చేశారు.