సీఎం జగన్‌పై మాజీ మంత్రి నారా లోకేష్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. జగన్‌పై ట్వీట్ల వర్షం కురిపించారు. ఈ సారి నేరుగా జగన్‌నే ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేశారు. పైకేమో వినయ విధేయ రాముడిలా కటింగ్ ఇస్తూ.. తెరవెనుక మాత్రం రైతులకి విత్తనాలు ఇవ్వొద్దు అని అధికారులకు ఆదేశాలిస్తున్నారని మండిపడ్డారు. జగన్.. మీరు వైసీపీ పార్టీకి అధినేత కావచ్చు.. కానీ ఈ రాష్ట్రానికి సీఎం కూడా.. అది గుర్తుపెట్టుకుని పాలన చేయండని సూచించారు. ప్రజా ధనం మీ సొత్తు కాదని.. దానిని దుర్వినియోగం చెయ్యద్దని ట్వీట్‌లో పేర్కొన్నారు.
‘@ysjagan గారేమో వినయ విధేయ రాముడిలా కటింగ్ ఇస్తుంటారు. తెరవెనుక మాత్రం వైసీపీ పార్టీ వాళ్ళకి తప్ప…రైతులకి విత్తనాల్ని ఇవొద్దు అని అధికారులకు ఆదేశాలిస్తున్నారు. జగన్ గారూ! మీరు వైసీపీ పార్టీకి అధినేత కావచ్చు. కానీ.. ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కూడా.. ప్రజాధనం మీ సొంత సొత్తుకాదు’.
.@ysjagan గారేమో వినయ విధేయ రాముడిలా కటింగ్ ఇస్తుంటారు. తెరవెనుక మాత్రం వైసీపీ పార్టీ వాళ్ళకి తప్ప…రైతులకి విత్తనాల్ని ఇవొద్దు అని అధికారులకు ఆదేశాలిస్తున్నారు. జగన్ గారూ! మీరు వైసీపీ పార్టీకి అధినేత కావచ్చు. కానీ ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కూడా. ప్రజాధనం మీ సొంత సొత్తుకాదు. pic.twitter.com/ZfBKgKuqeC
— Lokesh Nara (@naralokesh) August 1, 2019