టీడీపీ, వైసీపీల మధ్య ఫ్లెక్సీల వార్..!

చిత్తూరు జిల్లా శాంతిపురంలో అర్థరాత్రి హైడ్రామా నెలకొంది. టీడీపీ, వైసీపీ కార్యకర్తల మధ్య ఫ్లెక్సీల గొడవ చోటుచేసుకుంది. నేడు, రేపు చంద్రబాబు పర్యటన నేపథ్యంలో మాజీ సీఎంకు స్వాగతం పలుకుతూ టీడీపీ శ్రేణులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను తొలగించాలంటూ వైసీపీ కార్యకర్తలు ఆందోళనకు దిగడం ఉద్రిక్తతకు దారితీసింది. తమ పార్టీ బ్యానర్లకు అడ్డుగా టీడీపీ కార్యకర్తలు చంద్రబాబు ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారని వైసీపీ కార్యకర్తలు గొడవకు దిగారు. దాదాపు మూడు గంటలకు పైగా టీడీపీ, వైసీపీ కార్యకర్తల […]

టీడీపీ, వైసీపీల మధ్య ఫ్లెక్సీల వార్..!

Edited By:

Updated on: Jul 02, 2019 | 5:29 PM

చిత్తూరు జిల్లా శాంతిపురంలో అర్థరాత్రి హైడ్రామా నెలకొంది. టీడీపీ, వైసీపీ కార్యకర్తల మధ్య ఫ్లెక్సీల గొడవ చోటుచేసుకుంది. నేడు, రేపు చంద్రబాబు పర్యటన నేపథ్యంలో మాజీ సీఎంకు స్వాగతం పలుకుతూ టీడీపీ శ్రేణులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను తొలగించాలంటూ వైసీపీ కార్యకర్తలు ఆందోళనకు దిగడం ఉద్రిక్తతకు దారితీసింది.

తమ పార్టీ బ్యానర్లకు అడ్డుగా టీడీపీ కార్యకర్తలు చంద్రబాబు ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారని వైసీపీ కార్యకర్తలు గొడవకు దిగారు. దాదాపు మూడు గంటలకు పైగా టీడీపీ, వైసీపీ కార్యకర్తల మధ్య వాగ్వాదం జరిగింది. ఇరువర్గాలు రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు.

ఇవాళ, రేపు మాజీ సీఎం చంద్రబాబు కుప్పం నియోజకవర్గంలో పర్యటించనున్నారు. తనను కుప్పం నుంచి వరుసగా ఎమ్మెల్యేగా గెలిపిస్తూ వస్తున్న నియోజకవర్గ ప్రజలకు, పార్టీ కార్యకర్తలకు ఆయన ధన్యవాదాలు చెప్పనున్నారు. నియోజకవర్గంలోని పలు మండలాల్లో పర్యటిస్తున్న నేపథ్యంలో ఆ పార్టీ కార్యకర్తలు చంద్రబాబుకు స్వాగతం పలుకుతూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఫ్లెక్సీల ఏర్పాటును వైసీపీ వ్యతిరేకించడంతో వివాదం రాజుకుంది.

Loading...
Unable to load recommendations.
Follow Us