ఎన్నికల కోడ్ ఉల్లంఘించినందుకు రాజీవ్ కుమార్‍కు ఈసీ నోటీసు

| Edited By:

Mar 27, 2019 | 7:16 PM

కాంగ్రెస్ పార్టీ ఎన్నికల వాగ్దానంలో భాగంగా రాహుల్ గాంధీ ప్రకటించిన న్యూనతమ్ ఆయ్ యోజన (ఎన్‌వైఎవై-న్యాయ్) పథకాన్ని ప్రశ్నించిన నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ రాజీవ్ కుమార్‌కు ఎన్నికల సంఘం నోటీసులు జారీ చేసింది. దీనిపై రెండు రోజుల్లోగా సమాధానం ఇవ్వాలని ఈసీ ఆదేశించింది. రాజీవ్ కుమార్ ‘బ్యూరోక్రాటిక్ ఎగ్జిక్యూటివ్‌’గా ఉన్నందున పార్టీల ఎన్నికల ప్రచారంపై ఆయన వ్యాఖ్యలు చేయడం ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించడమేనని ఈసీ భావిస్తోంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే నిరుపేదలందరికీ నెలసరి […]

ఎన్నికల కోడ్ ఉల్లంఘించినందుకు రాజీవ్ కుమార్‍కు ఈసీ నోటీసు
Follow us on

కాంగ్రెస్ పార్టీ ఎన్నికల వాగ్దానంలో భాగంగా రాహుల్ గాంధీ ప్రకటించిన న్యూనతమ్ ఆయ్ యోజన (ఎన్‌వైఎవై-న్యాయ్) పథకాన్ని ప్రశ్నించిన నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ రాజీవ్ కుమార్‌కు ఎన్నికల సంఘం నోటీసులు జారీ చేసింది. దీనిపై రెండు రోజుల్లోగా సమాధానం ఇవ్వాలని ఈసీ ఆదేశించింది. రాజీవ్ కుమార్ ‘బ్యూరోక్రాటిక్ ఎగ్జిక్యూటివ్‌’గా ఉన్నందున పార్టీల ఎన్నికల ప్రచారంపై ఆయన వ్యాఖ్యలు చేయడం ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించడమేనని ఈసీ భావిస్తోంది.

కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే నిరుపేదలందరికీ నెలసరి కనీస ఆదాయ పథకాన్ని అమలు చేస్తామని, పేద కుటుంబాలకు వార్షికంగా రూ.72,000 తగ్గకుండా వారి అకౌంట్లలో జమచేస్తామని, ఇందువల్ల దేశ ప్రజల్లో 20 శాతం మందికి లబ్ధి చేకూరుతుందని ఆ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఇటీవల ప్రకటించారు. దీనిపై రాజీవ్ కుమార్ స్పందిస్తూ, కాంగ్రెస్ ఎన్నికల్లో గెలిచేందుకు చంద్రుడ్ని తెచ్చిస్తామంటోందన్నారు. ‘న్యాయ్‌’పై రాజీవ్ కుమార్ స్పందనపై కాంగ్రెస్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడింది. ‘రాజ్‌నీతి ఆయోగ్’కు సారథ్యం వహిస్తున్న రాజీవ్ కుమార్ తన పనిని బీజేపీ కార్యాలయం నుంచే చేసుకుంటే బాగుంటుందని, నేరుగా ఆయన ఎన్నికల్లో పోటీ చేయడం మంచిదని కాంగ్రెస్ ప్రతినిధి రణ్‌దీప్ సింగ్ సూర్జేవాలా ఘాటుగా విమర్శించారు.