మోదీ బయోపిక్ చిత్రనిర్మాత సందీప్ సింగ్‌ కేసులో దర్యాప్తు: అనిల్ దేశ్‌ముఖ్

దేశవ్యాప్తంగా సంచలనం రేపిన బాలీవుడ్ హీరో సుశాంత్ కేసు రాజకీయపార్టీల్లోనూ ప్రకంపనలు కలిగిస్తోంది. ఈ కేసుకు సంబంధించి మహారాష్ట్ర అధికారపార్టీకి సన్నిహితంగా ఉన్నవారిని రక్షించడానికి నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం చుట్టూ మాదకద్రవ్యాల వాడకం ఆరోపణలను పట్టించుకోలేదని బిజెపి ఆరోపించింది. దీంతో మహారాష్ట్ర ప్రభుత్వం శనివారం వెనక్కి తగ్గింది.

మోదీ బయోపిక్ చిత్రనిర్మాత సందీప్ సింగ్‌ కేసులో దర్యాప్తు: అనిల్ దేశ్‌ముఖ్

Edited By:

Updated on: Aug 30, 2020 | 1:34 PM

దేశవ్యాప్తంగా సంచలనం రేపిన బాలీవుడ్ హీరో సుశాంత్ కేసు రాజకీయపార్టీల్లోనూ ప్రకంపనలు కలిగిస్తోంది. ఈ కేసుకు సంబంధించి మహారాష్ట్ర అధికారపార్టీకి సన్నిహితంగా ఉన్నవారిని రక్షించడానికి నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం చుట్టూ మాదకద్రవ్యాల వాడకం ఆరోపణలను పట్టించుకోలేదని బిజెపి ఆరోపించింది. దీంతో మహారాష్ట్ర ప్రభుత్వం శనివారం వెనక్కి తగ్గింది.

2019 జాతీయ ఎన్నికలకు ముందే ప్రధాని నరేంద్రమోదీ జీవిత చరిత్రను రూపొందించినందుకు ప్రసిద్ధి చెందిన చిత్రనిర్మాత సందీప్ సింగ్‌పై వచ్చిన ఆరోపణలపై దర్యాప్తునకు ఆదేశిస్తామని మహారాష్ట్ర హోంమంత్రి అనిల్ దేశ్‌ముఖ్ అన్నారు. “ప్రధానిపై బయోపిక్ చేసిన సందీప్ సింగ్ పై సిబిఐ దర్యాప్తు చేయబోతోంది. ఆయనకు బిజెపితో ఎలాంటి సంబంధం ఉంది. అదేవిధంగా ఆయనకు బాలీవుడ్, డ్రగ్స్ తో ఎలాంటి సంబంధం ఉందన్న దానిపై చాలా ఫిర్యాదులు వచ్చాయని, దీనిపై సమగ్ర దర్యాప్తు చేయిస్తామని దేశ్‌ముఖ్ అన్నారు.

మహారాష్ట్రలో పాలక సంకీర్ణంలో భాగమైన కాంగ్రెస్, శివసేన, దేశ్ ముఖ్ నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీలతో శుక్రవారం సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ కేసులో “బిజెపి కోణం” పై దర్యాప్తు చేయాలని డిమాండ్ చేశారు. సుశాంత్ సింగ్ మృతిపై దర్యాప్తును అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు మహారాష్ట్ర ప్రభుత్వంపై వచ్చిన ఆరోపణల మధ్య, రాష్ట్ర కాంగ్రెస్ అధికార ప్రతినిధి సచిన్ సావంత్, మాదకద్రవ్యాలకు సంబంధించిన ఆరోపణలపై సందీప్ సింగ్‌ను సిబిఐ ప్రశ్నించబోతోందని పేర్కొన్నారు.

రాష్ట్ర బిజెపి ప్రతినిధి కేశవ్ ఉపాధ్యాయ్ మిస్టర్ సావంత్ ఆరోపణలు తిప్పికొట్టారు. 2015 కథనానికి లింక్ పోస్ట్ చేశారు. ఇది బాల్ ఠాక్రే అల్లుడు స్మితా ఠాక్రే, సందీప్ సింగ్ సహకారంతో దివంగత శివసేన అధినేతపై బయోపిక్ నిర్మించాలని యోచిస్తున్నట్లు చెప్పారు.

దేశ వ్యాప్తంగా జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అంతకు ముందున్న మెజారిటినీ క్రాస్ చేసి రాజకీయ విశ్లేషలకు సైతం ఔరా అనిపించాడు. అంతేకాదు వరుసగా రెండోసారి పూర్తిస్థాయి ఆధిత్యంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెసేతర నేతగా నరేంద్ర మోదీ రికార్డులకు ఎక్కాడు. ఇక ఒక ఛాయి వాలా నుంచి గుజరాత్ ముఖ్యమంత్రిగా.. ఆపై దేశ ప్రధాన మంత్రిగా ఎదిగారు. రెండోసారి ప్రధాన మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ఆయన జీవితంపై ‘పీఎం నరేంద్ర మోదీ’ బయోపిక్ తెరకెక్కింది.

Follow Us