ఏపీలో పంచాయతీ ఎన్నికల పోలింగ్ సమీపిస్తుండటంతో పాలిటిక్స్ హీటెక్కుతున్నాయి. శ్రీకాకుళంలో టీడీపీ సీనియర్ నేత అచ్చెన్నాయుడి అరెస్ట్‌తో వైసీపీ, టీడీపీ నేతల మధ్య మాటల యుద్ధం రేగుతుంది. అచ్చెన్నాయుడు సొంత గ్రామంలో దౌర్జనానికి పాల్పడ్డారని, కింజరాపు అప్పన్నను భయబ్రాంతులకు గురిచేశారని డిప్యూటి సీఎం ధర్మాన కృష్ణదాస్ మండిపడ్డారు.
చంద్రబాబు నాయుడు, అచ్చెన్నాయుడు ఇద్దరూ కలిసి ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగించే విధంగా ప్రవర్తిస్తున్నారని దుయ్యబట్టారు. ఎన్నికల కమిషనర్ అచ్చెన్నాయుడుపై చర్యలు తీసుకోమని ఆదేశించారని, అచ్చెన్నాయుడు అరెస్టుపై టీడీపీ నేతలు బురద జల్లడం తగదన్నారు.
ఎన్నికలకు వైసీపీ భయపడదని తెలిపారు. సీఎం జగన్ ఆధ్వర్యంలో ప్రజరంజక పాలన జరుగుతుందని పేర్కొన్నారు. టీడీపీ నేతలే దౌర్జన్యలు, అక్రమాలకు పాల్పడి, వైసీపీపై విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. పోలీసులను భయపెట్టే విధంగా అచ్చెన్నాయుడు మాట్లాడుతున్నారని అచ్చెన్నాయుడి బెదిరింపులకు ఎవరూ భయపడరని తెలిపారు.